Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

జోగమ్మపేటలోరాష్ట్రస్థాయి కరాటేపోటీలు

600మంది క్రీడాకారులు, కోచ్ లు, తల్లిదండ్రులు హాజరు
విశాలాంధ్ర,సీతానగరం:రాష్ట్రస్థాయి 67వ  కరాటేపోటీలను పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలంలో జోగమ్మపేటలోని డాక్టరు బి ఆర్ అంబేద్కర్ గురుకులం, ప్రతిభ పాఠశాల,
కెజిబివి విద్యాలయాల ప్రాంగణంలో మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు,పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు, శాసనమండలి సభ్యులు పాకలపాటి రఘువర్మలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.క్రీడల వల్ల మానసిక ఒత్తిడి తగ్గి,విద్యార్థులలో జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు.మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కరాటే పోటీలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు.జిల్లా విద్యాశాఖాధికారి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎన్ ప్రేమ్ కుమార్ , జిల్లా క్రీడా అభివృధ్ది అధికారి ఎన్ వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ మూడు రోజులుపాటు అండర్ 14,17,19బాలురు, బాలికలకు సంబందించి దాదాపు 600మంది క్రీడాకారులు, కోచ్ లు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు.రాష్ట్ర స్థాయి పోటీలలో 14,17,19 సంవత్సరాలలోపు పాల్గొన్న బాలురు-బాలికలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపిపి ప్రతినిది బలగ శ్రీరాములు,జెడ్పీటీసీ బాబ్జి,సర్పంచ్ కల్యంపూడి సింహాచలం, ఎంఈఓలు సూరి దేముడు, వెంకటరమణ, ప్రిన్సిపాళ్లు కె.ఈశ్వరరావు,పి.వెంకటనాయుడు, జె.సంధ్య, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పిడిలు, పిఈటిలు డిటి గాంధీ, ఎం.వాసుదేవరావు, మజ్జి రామకృష్ణ, మండంగి మురళి,ముప్పాళ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img