Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

బ్యాంకింగుపై విద్యార్ధులు అవగాహన పొందాలి: బిఎం జగదీశ్

విశాలాంధ్ర-సీతానగరం: బ్యాంకింగు వ్యవస్థ పై, బ్యాంకు లావాదేవీలు నిర్వహణపై విద్యార్థులకు అవగాహన అవసరమని స్థానిక యూనియన్ బ్యాంకు బ్రాంచి మేనేజర్ కె. జగదీష్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనలమేరకు మండలంలోని తొమ్మిదిప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆర్థిక చేరికపై మండల స్థాయి క్విజ్ పోటీలు బుధవారం స్థానిక ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. బ్యాంకు సేవలు గూర్చి వివరించారు. క్విజ్ పోటీల్లో ఆర్.వెంకమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల, నిడగల్లు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల,సీతానగరం జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల విద్యార్ధులు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించినట్లు తెలిపారు. ఈనెల 28న నిర్వహించనున్న జిల్లా స్థాయి క్విజ్‌ పోటీలో మొదటి మూడు స్థానాల్లో ఎంపికైనవిజేతలు పాల్గొంటారని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంఈఓ జి.సూరిదేముడు, హెచ్ ఎం ఇళ్లా ప్రసన్నలక్ష్మి, ఆయాపాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img