విశాలాంధ్ర, సీతానగరం: బాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటంకోసం మేము సైతం రిలే నిరాహారదీక్షలలో భాగంగా 4వరోజు శనివారంనాడు నియోజక వర్గంలోని టీడీపీ , జనసేన నేతలు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సైనికులు పెద్దఎత్తున పాల్గొని బాబుకు మద్దతుగ రిలే నిరాహారదీక్షలు సీతానగరం మండల కేంద్రంలో నిర్వహించారు. శిభిరం వద్దనే బాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మండల టీడీపి అధ్యక్షుడు కొల్లి తిరుపతిరావు శిరో ముండనం చేయించుకున్నారు.ఈకార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి బోనెల విజయ్ చంద్ర, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, బొబ్బిలి యువరాజు,టీడీపీ ఇంచార్జి బేబీనాయన, టీడిపి నియోజక వర్గ నాయకులు వాడాడ రాము, గర్భాపు ఉదయభానులతోపాటు టీడీపీ అధ్యక్ష,కార్యదర్శులు కొల్లి తిరుపతిరావు రౌతు వేణుగోపాల్, పోల సత్యనారాయణ (పిఎస్ఎన్)పార్వతీపురం నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, రెడ్డి శ్రీనివాసరావు, బార్నాల సీతారాం, కోరాడ నారాయణరావు,బలిజిపేట పార్టీ అద్యక్షుడు పెంకి వేణుగోపాల్, మండల టీడీపీ నేతలు సాల హరిగోపాల్, తేరేజమ్మ, బుడితి శ్రీను, సబ్బాన శ్రీను, పెంట సత్యంనాయుడు,లక్ష్మణరావు, పారి నాయుడు,సింహాచలం,సతీష్, పెంట సురేష్, బొత్స వెంకటనాయుడు, బీమశంకర్,శేఖర్,సూర్యనారాయణ, రామక్రిష్ణనాయుడు, భాస్కరరావు, గుంప స్వామి,జగన్నాధం, శంకరరావు, పెంట ఉమాతోపాటు మండల, గ్రామాల టీడీపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలూ తదితరుల పాల్గొన్నారు.