విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కెల్ల శ్రీనివాసరావు కోరారు.శుక్రవారం బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీ డిక్లరేషన్ లో బీసీ భద్రతా చట్టాన్ని అమలు చేయాలన్నారు. జిల్లాలో బీసీ భవన్ నిర్మాణానికి జిల్లా కు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే లు అధికారులు కృషి చేయాలన్నారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర రావు ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేశామన్నారు. బీసీల సంక్షేమనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఈ నెల 15న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకరరావు పుట్టినరోజు వేడుకలను అన్నీ మండలాల్లో నియోజకవర్గాల్లో జిల్లా కేంద్రం లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లె సూరిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు తోటపల్లి బుజ్జిబాబు, జిల్లా యూత్ అధ్యక్షులు బొబ్బాది చంద్రనాయుడు, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి సన్యాసి రావు పాల్గొన్నారు