Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పెదబోగిలి రైతు భరోసా కేంద్రాన్ని ఆకస్మిక తనఖీ చేసిన జిల్లా కలెక్టర్

విశాలాంధ్ర, సీతానగరం: మండల కేంద్రం లోని పెదబోగిలి రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు.వరివిత్తనాలు,ఎరువులు ఎంత ఎంత పరిమాణంలో ముందస్తు నిల్వలు చేశారో వాటిగురించి అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా విత్తనాలు మరియు ఎరువులు నిల్వలను పరిశీలించరు.విత్తనాలు కోసం త్వరితగతిన డికృషిలో రిజిస్ట్రేషన్ చెయ్యాలని ఆదేశించారు. సకాలంలో రైతులకు విత్తనాలు అందించడమే లక్ష్యంగా ముందస్తుగా నిల్వలు చేయడం జరిగిందని,ఎరువులను నిల్వ ఉంచడానికి కొత్తగా నిర్మిత మైన సచివాలయంలో ఉన్న గోడౌన్ తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారికి సూచించారు.ఇంతవరకు 50శాతంమేర విత్తనాలు ముందస్తుగా నిల్వలు ఉంచడం జరిగిందని చెప్పగా, మిగతా 50శాతంవిత్తనాలను కూడా వెంటనే రైతు భరోసా కేంద్రాలకు తెప్పించాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. అలాగే ముందస్తుగా డిఎపితో పాటుగా యూరియాను కూడా రైతులకు అందుబాటులో ఉండే విధంగా తెప్పించాలని ఆదేశించారు. నూతన సచివాలయ భవనాలలోగల గోడౌన్లలో రైతు భరోసా కేంద్రాలకు సంబందించిన ఎరువులను అందులో పెట్టించాలన్నారు. ఇంతవరకు ఎన్ని నూతన భవనాల గోడౌన్లు సిద్ధంగా ఉన్నాయో వాటి జాబితాను జిల్లా వ్యవసాయ అధికారి వారి ఆధీనంలోకి తీసుకోమని తెలియచేసారు . ఈకార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్,తహశీల్దార్ ఎన్వీ రమణ, మండల వ్యవసాాయాధికారి అవినాష్, డిప్యూటీ తహశీల్దార్ షేక్ మహమ్మద్,గ్రామవ్యవసాయ సహాకులు , సచివాలయం సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img