విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : శ్రీ చైతన్య పాఠశాల కామాక్షి నగర్ బ్రాంచ్ లో శ్రీ చైతన్య పాఠశాల వ్యవస్థాపకుడు విద్యార్థుల ఆశాజ్యోతి డా బి వి రావు ప్రథమ వర్ధంతి కార్యక్రమం జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలమంది విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, స్థిరపడటానికి కృషిచేసిన మహనీయుడు డా. బి వి రావు అని కొనియాడారు. పాఠశాల ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి శ్రీనివాస రావు మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది వాళ్ళ భవిష్యత్తుకు ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలికిన మహా నుభావుడు డా బి వి రావు అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎం జ్యోతి మాట్లాడుతూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన వేలమందికి ఉపాధి కల్పించిన ధన్యజీవి డా. బి వి రావు అని ఆయనను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ కోఆర్డినేటర్ యన్. వెంకటరమణ పాఠశాల డీన్స్ త్రినాధ నాయుడు, అప్పలనాయుడు, ఉపాధ్యాయులు విద్యార్థులు డా శ్రీ బి .వి రావుకి శ్రద్ధాంజలి ఘటించారు. అతని గుర్తుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.