Monday, September 25, 2023
Monday, September 25, 2023

నేడు కొమరాడలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహణ

విశాలాంధ్ర,పార్వతీపురం : మండల స్థాయిలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో నిర్వహించే జగనన్నకు చెబుదాం కార్యక్రమంను బుధవారం కొమరాడలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొమరాడ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల నుండి జగనన్నకు చెబుదాం స్పందనా కార్యక్రమం ఉంటుందని, ప్రజలు తమ అర్జీలను సమర్పించవచ్చని తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం 22న మక్కువ, 27న గరుగుబిల్లి, 29న పాలకొండ, అక్టోబరు 4న జియ్యమ్మవలస, 6న వీరఘట్టం, 11న కురుపాం, 13న సీతంపేట, 18న సాలూరు, 20న పాచిపెంట, 25న భామిని, 27న గుమ్మలక్ష్మిపురం మండలాల్లో జరుగుతుందని ఆయన చెప్పారు. ఆయా మండలాల పరిధిలోని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img