Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనూహ్య స్పందన

విశాలాంధ్ర, సీతానగరం : ప్రభుత్వ ఆదేశాలమేరకు జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో మండలస్థాయిలో మొట్టమొదటి సారిగా మన్యంజిల్లాలో శుక్రవారం నిర్వహించిన సీతానగరం మండలంలోని జగనన్నకు చెబుదాం కార్యక్రమంకు అనూహ్య స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, ఆర్డీఓ కె.హేమలతలు నిర్వహించగా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొనగా,మండలంలోని ప్రజలు వ్యక్తిగత, సామాజిక సమస్యలపై 80వినతులు సమర్పించారు.
త్వరితగతిన పరిష్కారమే ధ్యేయం:
జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సమర్పించిన ఆర్జీలకు త్వరితగిన పరిష్కారమే ధ్యేయమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. అవకాశం ఉంటే తక్షణమే పరిష్కారంచేయుటకు కృషి చేస్తున్నామని చెప్పారు. మండలంలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. మండలస్థాయి సమస్యలు మండలంలోనే పరిష్కారం కావాలని ప్రభుత్వ అభిమతమనివివరించారు.15మండలాలలో అక్టోబరు 20వరకు నిర్వహిస్తామని తెలిపారు.మండలంలోని ఇప్పలవలస గ్రామపరిధిలో నాలుగు క్వారీలు ఉన్నాయని, 30 సంవత్సరాల నుండి క్వారీ వాళ్లు మైనింగ్ వారికి లీజు చెల్లిస్తున్నారని, ఇప్పటివరకు మాపంచాయతీకి మైనింగ్ వాళ్ల దగ్గర నుండి ఒకరూపాయి కూడా రాలేదని, మాపంచాయతీకి రావలసిన లీజు మొత్తం ఇప్పించాలని ఇప్పలవలస గ్రామ సర్పంచ్ చింతల.లక్ష్మణరావు వినతి పత్రాన్ని సమర్పించారు. రెడ్డివానివలస గ్రామానికి చెందిన రైతుసంఘం నాయకులు రెడ్డి.లక్షుమునాయుడు, రెడ్డి ఈశ్వరరావు తదితరులు ఎన్.సి.ఎస్ షుగర్ ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేయాలని, 2023-2024 సీజనకు చెరుకును సంకిలి షుగర్ ఫ్యాక్టరీకి తరలిస్తే రవాణా చార్జీలు యాజమాన్యం నుండి ఇప్పించాలని వినతి పత్రాన్ని సమర్పించారు.కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని, క్లీన్ డ గ్రీన్ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని క్లాప్ మిత్రలను నియమించిందని, తమకు 12 నెలలుగా జీతాలు రాకపోవడం వలన ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వం మాకు జీతాలు చెల్లించే చర్యలు తీసుకోవాలని మండలంలోని అన్ని గ్రామాల క్లాప్ మిత్రలు సిటు నాయకుడు వెంకటరమణ, గౌరు ఆద్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1998 వ సంవత్సరంలో నియమించబడిన వృత్తి విద్య కోర్సుల్లో పార్ట్ టైమ్ లేబ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని క్రమబద్ధీకరణం చేయాలని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సి.ఈ.టి. ల్యాబ్ అసిస్టెంట్ ఎస్.రాజు దరఖాస్తు అందజేశారు అందజేశారు. రెడ్డివానివలస గ్రామానికి చెందిన రెడ్డి.ఈశ్వరరావు 2021 నుంచి 2023 వరకు ఆర్.వెంకంపేట రైతు భరోసా కేంద్రానికి ధాన్యం పంపించానని, దానికి సంబంధించిన రవాణా చార్జీలు ఇప్పించాలని వినతిపత్రం సమర్పించారు.
పెదభోగిలిగ్రామ పంచాయతీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నస్లీపర్లు, సిబ్బంది వేతనాలను పెంచాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. మక్కువ – అజ్జాడ రహదారి మరమ్మతులు చేపట్టాలని, గ్రామంలో రహదారి పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను మార్చాలని, పెదభోగిలలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఎస్. జయమణి తరుపున ఆమె భర్త రామారావు వినతిపత్రాన్ని అందజేశారు. నిడగల్లు, ఇప్పలవలస గ్రామాలకు జంఝావతి కాలువద్వారానీరు వచ్చే చర్యలు తీసుకోవాలని గాజాపు శ్రీనివాసరావు,సూర్యనారాయణ, తిరుపతిరావు తదితరులు వినతి పత్రాన్ని అందజేశారు.వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు,ఎంపీటీసీలు, నాయకులు విచ్చేసి వినతి పత్రాలను అందజేశారు.టీడీపి, వామపక్షాలకు చెందిన నాయకులు విచ్చేసి పలు వినతి పత్రాలు అందజేశారు.శుక్రవారం మండలంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లావైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథరావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్రరావు, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకరరావు, జిల్లా గ్రామపంచాయతీఅధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా ఉద్యాన అధికారి కె.వి.ఎస్.ఎన్ రెడ్డి, జిల్లా సహకార అధికారి సన్యాసి నాయుడు, జిల్లా మత్స్య శాఖ అధికారి వి. తిరుపతయ్య, జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయ గౌరి, జిల్లా ప్రణాళిక అధికారి పి. వీర రాజు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎం.డి.గయాజుద్దీన్, జిల్లా బిసి సంక్షేమ సాధికారిత అధికారి ఎస్.కృష్ణ, జిల్లా కార్మిక శాఖ అధికారి కె. రామకృష్ణారావు, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారి ఎం.జేమ్స్ , డివిఈఓ మంజులవీణా, విద్యాశాఖ ఏడీ రామజ్యోతి, జిల్లా మత్స్య శాఖాధికారి తిరుపతయ్య తదితర జిల్లా అధికారులతో పాటు సీతానగరం మండల తహశీల్దార్ ఎన్వీ రమణ, ఎంపిడిఓ ప్రసాద్, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల మండలఅధికారులుపాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img