Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉత్తరాంధ్రలో శాంతిభద్రతలు ప్రశాంతం


డిఐజి ఆఫ్ పోలీస్ హరికృష్ణ

సీతానగరం: ఉత్తరాంధ్ర జిల్లాల్లో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని విశాఖపట్టణం డిఐజి ఆఫ్ పోలీస్ ఎస్.హరికృష్ణ తెలిపారు.సోమవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం సర్కిల్ పరిధిలోని సీతానగరం పోలిస్ స్టేషన్ తనిఖీ నిమిత్తం విచ్చేశారు. ఆయనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. మన్యం జిల్లాలో ప్రశాంత వాతావరణం ఉందని తెలిపారు. గంజాయి రవాణా గూర్చి విలేకరులు ప్రస్తావించగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 8మండలాల్లో 2021లో సుమారు 7వేల500 ఎకరాల్లో పంటలను గుర్తించి దగ్దంచేసినట్లు చెప్పారు. గతఏడాది కూడా దాడులు నిర్వహించి చాలాప్రాంతాలలో గంజాయి సాగును ద్వంసం చేసినట్లు చెప్పారు.ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం ద్వారా ఆయామండలాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను గిరిజనులకు చూపిస్తూ,ప్రత్యామ్నాయ పంటలసాగుపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గంజాయి రవాణాపై విస్కృతంగా నిఘాలుపెంచి పెద్దఎత్తున కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఒడిస్సాలో గంజాయి సాగువల్ల మనవైపు అక్రమంగా రవాణా జరగడంతో పోలీసుల ముమ్మర తనిఖీలువల్ల ఎక్కువకేసులు నమోదు జరుగుతున్నాయని తెలిపారు. మరోఏడాది కాలంలో పూర్తిగా గంజాయి రవాణా నిర్మూలన లక్ష్యంగా పోలీస్ సిబ్బంది పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పెద్ద ఎత్తున నిఘా పెంచి గంజాయి సాగును, రవాణాను అరికట్టడంజరిగిందన్నారు. గిరిజన ప్రాంతాల్లోని గిరిజనులు కూడా గంజాయి పంటలసాగుకు స్వస్తి పలికి కాపీ వంటి పంటల సాగుపై దృష్టి పెట్టారని చెప్పారు. ఇదిలా ఉండగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నక్సల్ ప్రభావితం పూర్తిగా లేదని ఆయన చెప్పారు. పలు పోలిస్ స్టేషన్ల మరమ్మత్తులు, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణాలుగూర్చి పోలీస్ కార్పొరేషన్ కు ప్రతిపాధనలు పంపిస్తున్నట్లు తెలిపారు. పోలిస్ స్టేషన్ తనిఖీపై సంతృప్తి వ్యక్తం చేశారు. మొదటిసారిగా విచ్చేసిన డిఐజి హరికృష్ణకు పోలీసులు గౌరవ వందనం ఇచ్చి సెల్యూట్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఓ. దిలీప్, పార్వతీపురం డి.ఎస్పీ ఏ.సుభాష్, ఎస్బి సిఐ శ్రీనివాసరావు, పార్వతీపురం సర్కిల్ గ్రామీణ, పట్టణ సిఐలు విజయా ఆనంద్,కృష్ణారావు,సీతానగరం
బలిజిపేట ఎస్ఐలు నీలకంఠం, ప్రశాంత్ కుమార్, ఏ ఎస్ఐ శ్రీనివాసరావు, పోలిస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img