Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

75ఏళ్ల స్వాతంత్య్రం పేదలకు ఏమిచ్చింది

కోటీశ్వరుల ఆస్తులు పెంచడానికే ఈపాలకులా?
సీపీఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రామక్రష్ణ

పార్వతీపురం : స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు గడుస్తున్న ఇంతవరకు మనల్ని పరిపాలించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుపేదలకు ఇచ్చింది ఏమీ లేదని, కోటీశ్వరుల ఆస్తులు పెంచడానికే ఈపాలకులా? అని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు.శుక్రవారం పార్వతీపురం మన్యంజిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ లో జరిగిన జిల్లా మొదటి మహాసభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో మోదీ ,రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేకపాలనపై పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ధరలు పెరుగుదలతో పేదవాడు పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదన్నారు. మోడీ విధానాలు అంబానీలు, అధానీలు వంటి ధనవంతుల సంపాదనలకే తప్ప పేదవాడికోసం కాదన్నారు. మోడీ గిరిజన మహిళకు రాష్ట్రపతి పదవిఇచ్చి గిరిజనులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకుంటున్నారని,అటువంటి గిరిజన ఏరియాలో కరెంటు,ఆసుపత్రి, రోడ్లు, త్రాగునీరు, పాటశాలలు తదితర మౌలిక సదుపాయాలు లేని గిరిజనగ్రామాలు ఎన్నో ఉన్నాయన్నారు. గిరిజన చట్టాలను అమలు చేయడం లేదన్నారు.ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాల్లో ఇటీవల జరిగిన సర్వేలో మనదేశం 101 స్థానంలో వుందంటే మనపరిస్థితి పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే దయనీయంగా వుండడం చూస్తే కేంద్రంలో ఎనిమిదేళ్లబిజెజెపి పాలన ఎలా ఉందో తెలుస్తుందన్నారు. అభివృద్ధి మాటే లేదన్నారు. నిత్యావసరాలు, గ్యాస్ ధరలు నిత్యం పెరుగుతూ పోతున్నాయన్నారు. 26 ప్రభుత్వ రంగ పరిశ్రమలనునిర్వీర్యం చేశారన్నారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేయడమే మోడీ ప్రధాన ధ్యేయమన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి రెండుకోట్ల చొప్పునఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఎనిమిదేళ్లలో 16కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన మోడీ కనీసం 16లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు.
రాష్ట్రంలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, అప్పులపై రాష్ట్రప్రభుత్వంఆధారపడి నడుస్తున్నదన్నారు. దీనికోసమే ఎల్లపుడూ ఢిల్లీచుట్టూ తిరుగుతూ తెచ్చిన అప్పులో పావలా ప్రజలకు కేటాయించి మిగిలన 75పైసలుతన ఖాతాకు మళ్లిస్తున్నారన్నారు. వారంవారం అప్పులు చేయాల్సిన పరిస్థితికి పరిపాలనా తెచ్చాడన్నారు. విభజనప్పుడు 96 వేలకోట్ల అప్పుంటే ప్రస్తుతం 8 లక్షల.36 వేలకోట్ల అప్పుఉందని, జగన్మోహన్ రెడ్డి గద్దెదిగేనాటికి రాష్ట్రంలో 10లక్షలకోట్లు అప్పుంటుందన్నారు.అప్పుచేస్తే తప్ప జీతాలు , పింఛనులు, సంక్షేమ పథకాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రప్రభుత్వం వుందన్నారు.రాష్ట్రంలో ఎక్కడా చూసిన, ఎక్కడవింటున్న జగన్ ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి చర్చలే ఉంటున్నాయని చెప్పారు. రాష్ట్రంలో మూడేళ్లలో అభివృద్ది పూర్తిగా క్షీణించిదన్నారు. ప్రభుత్వ పనితీరుపై ధర్నాలు,రాస్తారోకోలు, నిరసనలు, ఉద్యమాలు చేస్తే పోలీసుల అదుపులోకి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దారుణంగా ఉందన్నారు.
భజన కోసం, తిట్లుకోసమే వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహణ:
గతనెలలో విజయవాడలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లినరీ రెండురోజుల సమావేశాలుకేవలం జగన్మోహన్ రెడ్డికి భజనగా మారిందన్నారు.తమఅధినేతను పొగడడం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను,ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవి5, ఏబిఎన్ మీడియానుతిట్టడమే పనిగా సాగిందన్నారు. ప్లినరీలో పోలవరం, స్టీల్ ప్లాంట్ వంటిఅంశాల ప్రస్తాపనే కాకుండా రైతులగూర్చి, అభివృధ్ధిగూర్చి, మౌలిక సదుపాయాలు కల్పనగూర్చి ఎటువంటి చర్చలేదన్నారు. రెండురోజులు నాయకులకు అన్ని వంటకాలతో కూడిన తిండికోసమే ప్లీనరీ పెట్టారన్నారు.
ఎంపీ మాదవ్ నగ్న వీడియోపై సీఎం ఎందుకు స్పందించరూ…
ఢిల్లీ నుండి గల్లీ వరకు సంచలనం సృష్టించిన హిందూపురం ఎంపి గోరంట్ల మాధవ్ ఓమహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడిన సంఘటనపై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని రామకృష్ణ ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాల పరువును రోడ్డున పడేసిన ఎంపీ తీరుపై తక్షణమే స్పందించి ఆయనపై ముఖ్య మంత్రి జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపనితీరుపై అక్టోబరు నెలలో విజయవాడలో జరగనున్న జాతీయ మహాసభలకు పెద్దఎత్తున తండోప తండాలుగా తరలి రావాలని,విజయవాడ ఎరుపెక్కాలని పిలుపునిచ్చారు. విజయరాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ పార్వతీపురం మన్యంజిల్లా లో గిరిజన, హరిజన నియోజక వర్గాల్లో ఉండేవారికి ప్రభుత్వం కనీస అవసరాలు కల్పించాలని డిమాండ్ చేశారు.పోడు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్న గిరిజనులను కూడా నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచి వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గిరిజనుల అటవీ హక్కుల చట్టంనుకూడా నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఈప్రాంతంలో ఐదేళ్లుగా ఏనుగులతోరైతులకు జరుగుతున్న అన్యాయం అంతా ఇంతా కాదన్నారు. ఈజిల్లాలో గిరిజన, హరిజన సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కోరారు. మండుటెండలో మహాసభలకు పెద్ద ఎత్తున గిరిజన మహిళలు, యువకుల పెద్ద ఎత్తున రావడమేగాక వారి నృత్యం, సాంప్రదాయ వాయిద్యంపట్ల అభినందించారు. ఈజిల్లామహాసభలు జిల్లా కార్యదర్శి కె మన్మధరావు అధ్యక్షతన జరగాయి. ముందుగా పాతబస్ స్టాండు నుండి ర్యాలీగా లయన్స్ క్లబ్ వరకు అంతా నినాదాలు చేస్తూ తరలివచ్చారు.సమావేశ స్థలం వద్ద ముండుగా జెండాను ఆవిష్కరించారు.అక్కడే ఏర్పాటు చేసిన స్తూపంవద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు, జిల్లాసహాయ కార్యదర్శి టి. జీవన్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. రామచంద్రరావు, బుడితి అప్పలనాయుడు, గరుగుబిల్లి సూరయ్య, జిల్లా సమితి సభ్యులుమండంగి సింగన్న దొర, ఈవినాయుడు, కె.లింగరాజు, సింహాద్రి దుర్గారావు, ఎఐఎస్ఎఫ్ నాయకులు నాగభూషణరావు, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు గోపినాయుడు, బిటి నాయుడు, ఉపాధ్యక్షులు సింహాద్రి కిరణ్ కుమార్,అమరులైన
కోరన్నమంగన్న కుటుంబసభ్యులు, ఏడు నియోజక వర్గాలనుంచి పెద్ద ఎత్తున సీపీఐ కార్యకర్తలు, సానుభూతిపరులు పాల్గొన్నారు. ర్యాలీలో రామకృష్ణ జెల్లీ విల్సన్ లు తుడుమడప్పులు కొట్టి గిరిజనులను ఉత్సాహ పరిచారు.ఎటువంటి అవాంచీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్ ఐ ఫ్రకృద్దీన్ అధ్వర్యంలో బందోబస్తును నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img