Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

డిసిఎంఎస్ లో ఘనంగా వైఎస్ఆర్ 74వ జయంతి వేడుకలు

విశాలాంధ్ర విజయనగరం : బడుగు,బలహీన వర్గాల పక్షపాతి, రైతు పక్షపాతి అయిన దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర రెడ్డి  తెలుగు ప్రజలకు అందించిన సేవలు అనిర్వచనీయమని ఉమ్మడి విజయనగరం సహకార మార్కెటింగ్ సొసైటీ (డిసిఎంఎస్ )చైర్ పర్సన్ డాక్టర్ అవనాపు భావన అన్నారు. శనివారం స్వర్గీయ రాజశేఖర రెడ్డి  74వ జయంతి సందర్భంగా డిసిఎంఎస్ కార్యాలయ ఆవరణంలో, ఆ మహనీయునికి నివాళులు అర్పించారు. వై ఎస్ ఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించారు. అనంతరం అవనాపు భావన,  మాట్లాడుతూ మహానాయకుడు రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల కోసం అహార్నిశలు శ్రమించారని, అనేక సంక్షేమ పధకాలను పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు. రాజశేఖర రెడ్డి స్వతగా వైద్యులు కావడంతో విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించారని,108 వంటి అద్భుతాన్ని ఆవిష్కరించారని అన్నారు. అలాగే అన్నదాతల కష్టాన్ని గుర్తించి, వారికి సేవలు అందిస్తూ రైతు పక్షపాతి అయ్యారని అన్నారు. అందుకే ఆయన పుట్టినరోజునే రైతు దినోత్సవంగా  ముఖ్యమంత్రి  జగన్మోహాన్ రెడ్డి ప్రకటించి, రైతులకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా హాజరైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల  వైఎస్ఆర్ యూత్ వింగ్ జోనల్ ఇన్ ఛార్జ్ అవనాపు విక్రమ్  మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి అంటేనే సంక్షేమం గుర్తుకు వస్తుందని అన్నారు. ఆయన మృతి చెంది 14 ఏళ్లు కావస్తున్నా, ఆయన తెలుగు రాష్ట్రాల అభివృద్దికి, తెలుగు ప్రజల సంక్షేమానికి చేసిన కృషి వల్ల తెలుగు ప్రజల గుండెల్లో చిరస్ధాయిగా నిలిచిపోయారన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకు వేస్తే, ఆ మహనీయుని తనయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి .  వైఎస్ జగన్మోహాన్ రెడ్డి  మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తూ  గాంధీజి కలలుకన్న  గ్రామ స్వరాజ్యాన్ని ప్రజలకు అందించేందుకు సచివాలయ వ్యవస్ధను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో జీ.కృష్ణంరాజు ,, శ్రీనివాస రాజు,మద్దిల అప్పలనాయుడు, యర్రంశెట్టి రఘు, ముని లక్ష్మణరావు, ఏర్నింటి నర్సింగరావు, సంపత్ ఈశ్వర రాజు, వంక అప్పలరాజు, సుంకర విజయ్, కాళ్ళ ప్రకాష్, యువజన విభాగం నాయకులు ఖాదర్, వంకర శ్యామ్, జామి విశ్వనాథ్, మనోజ్ రెడ్డి, రాజేష్ , హేమంత్, జస్ప్రీత్, ఇజాజ్, డీసీఎంఎస్ సిబ్బంది, వైఎస్సార్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img