Homeజిల్లాలుఅనంతపురంకోటవీధిలో గడపగడపకు ఆప్యాయ పలకరింపులు.. ప్రజల మద్దతు కోరిన ఎంపీటీసీ అభ్యర్థి.....

కోటవీధిలో గడపగడపకు ఆప్యాయ పలకరింపులు.. ప్రజల మద్దతు కోరిన ఎంపీటీసీ అభ్యర్థి…..

- Advertisement -

విశాలాంధ్ర – నార్పల :- మండల కేంద్రంలోని కోటవీధిలో ఎంపీటీసీ అభ్యర్థి 4వ గడపగడపకు ప్రచారం మంగళవారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ, ప్రజలతో మమేకమై ప్రచారాన్ని ముందుకు సాగించారు. ఇంటింటా ప్రజల ఆదరాభిమానాలను పొందుతూ, తనను ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా నార్పల ప్రసన్న కుమారి మాట్లాడుతూ మండల కేంద్రంలో మీ ఇంటి ఆడపడుచుగా మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, మీ కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తాను. మీ సమస్యలను నా సమస్యలుగా భావించి, మీకు సేవ చేయాలనే సంకల్పంతో మీ ముందుకు వచ్చాను. పదవిని ఆశించి కాకుండా, ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో అడుగులు వేస్తున్నాను. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మీకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించి, మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని విజ్ఞప్తి చేశారు.
ప్రచారంలో భాగంగా ప్రతి గడప వద్ద ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ, వారి ఆశీస్సులు, మద్దతు కోరారు. ప్రజలతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు