Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నాం..

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నాం..

- Advertisement -

జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

విశాలాంధ్ర ధర్మవరం::: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టడం జరిగిందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరంలో పలుచోట్ల పర్యటించారు. అనంతరం వారు మాట్లాడుతూ త్వరలో జరగనున్న మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలను సజావుగా నిర్వహిస్తామని వారు తెలిపారు. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణంలో ఎన్నికల భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ అడిషనల్ ఎస్పీ కె.వి. మహేష్, ధర్మవరం డీఎస్పీ బి.వి. జగన్నాథ్ రాజు తో కలిసి సమస్యాత్మక ప్రాంతాలైన గూడ్స్ కొట్టాలు, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించడం జరిగిందన్నారు.స్థానిక ప్రజలతో మాట్లాడి, ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని భరోసా కల్పించారు.ధర్మవరం పట్టణంలోని బీఎస్సార్ మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను ఎస్పీ గారు తనిఖీ చేసామని,ఎన్నికల సామగ్రి భద్రత, కేంద్రాల వద్ద చేపట్టిన రక్షణ చర్యలు, అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించి, నిరంతర పర్యవేక్షణతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేయడం, ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకోవడం లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు.ఎన్నికల నిబంధనలు, వర్తించే చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రౌడీషీటర్లు, గతంలో గొడవలకు పాల్పడిన వ్యక్తులు, ట్రబుల్ మాంగర్స్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఓటర్లు ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు.
ధర్మవరం పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించడం ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తామని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడైనా గొడవలు, అల్లర్లు లేదా ఇతర అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే గుర్తించి సత్వర చర్యలు తీసుకునేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని వివరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని స్పష్టం చేశారు.అదేవిధంగా అడిషనల్ ఎస్పీ కె.వి. మహేష్ పట్టణంలోని లోన్ కోటలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో అల్లర్లు, గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంట డీఎస్పీ లు శ్రీ బి.వి. జగన్నాథ్ రాజు, శ్రీనివాసులు, సీఐలు రెడ్డప్ప, జయనాయక్, లింగన్న ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు