అడిషనల్ ఎస్పీ కె.వి. మహేష్
విశాలాంధ్ర ధర్మవరం; ఎన్నికలవేళ పట్టణంలో అల్లలు సృష్టించిన ఓటర్లను బెదిరించిన కఠినంగా వ్యవహరిస్తామని అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాటమాట్లాడుతూ ధర్మవరం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, నాయకులతో ఎన్నికల నిబంధనలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.ధర్మవరం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా ధర్మవరం పట్టణ డీఎస్పీ, జగన్నాథ్ రాజు, సీఐలు, రెడ్డప్ప, జయ నాయక్ ఎస్ఐలతో కలిసి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పోటీ చేస్తున్న అభ్యర్థులు, నాయకులతో సమావేశం నిర్వహించి ఎన్నికల నియమావళి, పోలీసు ఆంక్షలపై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి అని, అమల్లో ఉన్న సెక్షన్ 144, సెక్షన్ 30 పోలీసు చట్టం నిబంధనలను ఉల్లంఘించరాదు అని తెలిపారు.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా సంబంధిత చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అవసరమైన మేరకు అరెస్టులు చేయడంలో వెనుకాడమని వారు స్పష్టం చేశారు. ఎన్నికల శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారెవరైనా చట్టానికి అతీతులు కారు అని, నిబంధనలు ఉల్లంఘించే వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించి ధర్మవరం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా బాధ్యతగా వ్యవహరించాలి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి జగన్నాథరాజు, సిఐలు రెడ్డప్ప జయ నాయక్ , సునీత ఎస్ఐలు పాల్గొన్నారు.
అల్లర్లు సృష్టించినా, ఓటర్లను బెదిరించినా కఠినంగా వ్యవహరిస్తాం
- Advertisement -
RELATED ARTICLES


