విశాలాంధ్ర ధర్మవరం:: మట్టి వినాయకులను పూజిస్తాం, పర్యావరణాన్ని కాపాడాలని కరెస్పాండెంట్ నరేంద్ర బాబు తెలిపారు. ఈ సందర్భంగా
స్థానిక సాయినగర్ లొ గల సూర్య హై స్కూల్ లొ వినాయక చవితి వేడుకలను కరెస్పాండంట్ వై నరేంద్ర బాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. విద్యార్థులు మట్టివినాయకుని పూజించారు. మట్టి తో చేసిన వినాయకులను నిమజ్జనం చేయడం ద్వారా నీటి లోని జీవరశులు కు ప్రాణహాని ఉంటుంది అని విద్యార్థులు తెలియజేసారు. కెమికల్స్ తో చేసిన వినాయకులు వాడవద్దు అని తెలిపారు ఈ కార్యక్రమం లొ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మట్టి వినాయకుడిని పూజించండి. ప్రిన్సిపాల్ పద్మశ్రీ
మట్టి వినాయకుడిని విద్యార్థులు తయారుచేసి, పూజించాలని మోడల్ స్కూల్ అండ్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని మోడల్ స్కూల్ అండ్ కళాశాలలో విద్యార్థుల కొరకు వినాయక పండుగని దృష్టిలో ఉంచుకొని పాఠశాల విద్యార్థులందరికీ బంకమట్టిని పంపిణీ చేసి, వినాయకుని ప్రతిమను తయారు చేయించారు. ఈ సందర్భంగా మట్టితో తయారుచేసిన వినాయకులను వారు పోటీగా పరిశీలించి, అందులో ప్రధమ, ద్వితీయ స్థానంలో విజేతలను ప్రకటించి బహుమతులను వారు అందజేశారు. అనంతరం వినాయక పండుగ విశిష్టత గూర్చి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


