Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

అర్ధరాత్రి అరెస్టులు సిగ్గుచేటు…

విశాలాంధ్ర – కొయ్యలగూడెం : తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కళ్యాణి అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్య అని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి తీవ్రంగా ఆదివారం అర్ధరాత్రి పోలీసులు నేరుగా బెడ్ రూమ్ లోకి వెళ్లి దౌర్జన్యం చేయడం మహిళా లోకాన్ని అవమానించడమేనన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీని అడ్డుపెట్టుకొని వైసీపీ గూండాలు మహిళలపై అనేక అత్యాచారాలు, అరాచకాలు కొనసాగిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. నైట్ డ్రెస్ తో ఉన్న కళ్యాణి కనీసం డ్రస్సు మార్చకుండానే పోలీసులు స్టేషన్ కు తరలించడం జగన్ దుష్ట పాలనకు పరాకాష్ట అన్నారు.ఆంధ్ర రాష్ట్రంలో రౌడీ పాలన ఎక్కువైందని, టిడిపి కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యంగా, అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అధికారంలో కి రావడం ఖాయమని, మహిళలే వైసిపి ప్రభుత్వానికి ఓటు రూపంలో బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img