Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి….

దాడుల నివారణకు ప్రత్యేకచట్టం కావాలి….

జర్నలిస్టుల ధర్నాలో డి. సోమసుందర్ డిమాండ్…

విశాలాంధ్ర -తాడేపల్లిగూడెం: జర్నలిస్టులపై దాడుల నివారణకు ప్రత్యేకచట్టం చేయాలన్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిఫార్సును కేంద్రప్రభుత్వం పాటించాలని , వెంటనే చట్టం వేయాలని ఐజేయూ జాతీయకార్యదర్శి డి.సోమసుందర్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ ఏపియుడబ్ల్యూజే. రాష్ట్రకమిటీ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో పాత్రికేయులు తాసిల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి డి.సోమసుందర్ మాట్లాడుతూ ప్రపంచ పత్రికాస్వేచ్ఛా సూచికలో భారత్ స్థానం ఏటేటా దిగజారిపోతున్నదని , పాత్రికేయులు స్వేచ్ఛగా విధినిర్వహణ చేయలేని దారుణ పరిస్థితులలు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై నానాటికీ దాడులు , తప్పుడుకేసులు పెరిగిపోతున్నాయన్నారు. దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని , దాడులు పునరావృతం కాకుండా కఠినచర్యలు తీసుకోవాలని డి. సోమసుందర్ డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో పాత్రికేయులపై దాడులు మరింతగా పెరిగేప్రమాదం ఉందని , జర్నలిస్టులు ఐక్యంగా నిలబడి దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఏపి యుడబ్ల్యూ.జే, ప.గో. జిల్లాశాఖ కన్వీనర్ గజపతి వరప్రసాద్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు పెరగడం పత్రికాస్వేచ్ఛకు హానికరమని అన్నారు. రాజకీయనాయకుల్లో అసహన ధోరణులు పెరిగిపోవడం , యాజమాన్యాలు కూడా రాజకీయపార్టీలకు కొమ్ముకాయడం పాత్రికేయులపై దాడులు పెరగడానికి కారణమన్నారు. పాత్రికేయులు స్వతంత్రంగా పనిచేసేహక్కును కాపాడుకోవాలని అన్నారు.
జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు పెద్దోజు మురళి ,ప్రెస్ క్లబ్ ప్రధానకార్యదర్శి మైలవరపు రవికిరణ్ , స్టూడియో ఎన్ స్టేట్ బ్యూరో ఇన్ ఛార్జ్ వి. పుండరీకాక్షుడు , తదితరులు మాట్లాడుతూ పాత్రికేయులపై దాడులను ఖండించారు.
ధర్నాలో ప్రింట్ ,ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు.

పాత్రికేయులపై దాడులా సిగ్గు సిగ్గు , పత్రికా స్వేచ్ఛను కాపాడండి , జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి , దాడికేసుల నిందితులను వెంటనే అరెస్టు చేయాలి, అక్రమ కేసులను ఎత్తివేయాలి , వంటి నినాదాలతో తహశీల్దారు కార్యాలయ ప్రాంగణాన్ని హోరెత్తించారు.
జర్నలిస్టుల ధర్నాకు మానవహక్కుల వేదిక జిల్లాప్రధానకార్యదర్శి టి.ఆనందరావు , ఏ.ఐ.టి.యు.సి. నాయకులు ఓసూరి వీర్రాజు , తాడికొండ శ్రీనివాసరావు సంఘీభావం ప్రకటించారు.
హైదరాబాద్ , తణుకు , కర్నూలు కేంద్రాల్లో జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేకచట్టం చేయాలనీ, విజయనగరం పాత్రికేయులపై సిఐడి పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలని కోరుతూ తాహసీల్దారుకు వై. అప్పారావు కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తాహసీల్డారు అప్పారావు మాట్లాడుతూ విధినిర్వహణలో ఉన్న పాత్రికేయులపై దాడులు చేయడం గర్హనియమని అన్నారు. ఆరోపణలపై వార్తలు రాస్తే వివరణ ఇవ్వాలి తప్ప విలేఖరులపై భౌతికదాడులకు పాల్పడటం సమర్థనీయం కాదని , దాడులపై చట్టబద్ధంగా తగిన చర్యలు తీసుకోవాలని అప్పారావు అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు షేక్ ఖాదర్ మొహియుద్దీన్, చిట్యాల రాంబాబు, సిటీకేబుల్ న్యూస్ ఎడిటర్ వై.ఎన్.వి. రమేష్ , హాలో తాడేపల్లిగూడెం పత్రికా సంపాదకుడు కొడాలి రమేష్ బాబు, పాత్రికేయులు బూర్గుల భానుశ్రీనివాస్ , యద్దనపూడి సుబ్బారావు , అడపా సూర్యప్రకాష్. గొలిమే బుజ్జిబాబు , బాసంశెట్టి బాల బాలాజీ , మేక ఆదినారాయణ సుందరనీడి వెంకటలక్ష్మయ్య , సూరత్తు రాజ్ కుమార్ , మణికంఠ , నరేష్. శీలి మహేష్ , కంకట శ్రీనివాసరావు , చిట్రోజు కృష్ణ , కొత్తపల్లి గోపీచంద్ , నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img