Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

తల్లిదండ్రుల సహకారంతోనే విద్యార్థిని విద్యార్థులలో ఉన్నత విలువలు….

అల్లూరి రవివర్మ
విశాలాంధ్ర`ఉండి : విద్యార్థిని విద్యార్థుల్లో ఉన్నత విలువలు కల్పించాలంటే విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం ఎంతైనా కావాలని భీమవరం ఉప ఖజానా అధికారి అల్లూరి రవి వర్మ అన్నారు. శనివారం ఉండి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల లో ఐక్య నేషనల్‌ పౌండేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లి దండ్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు పౌండేషన్‌ ఛైర్మెన్‌ ముదునూరి శివరామరాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న రవివర్మ మాట్లాడుతూ ఐక్య పౌండేషన్‌ కొంత మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని వాళ్ళ ల్లో నైతిక విలువలు పెంపొందించుటకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగాఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు భావనకు ప్రధమ బహుమతి, గాయత్రికి ద్వితీయ బహుమతులు అందజేశారు. అనంతరం రవివర్మ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రజీ, ఆనంద్‌, వెంకటేశ్వర రావు, విద్యార్థుల తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img