Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

దళిత ఎమ్మెల్యేలపై వైసీపీ గుండాల దాడి హేయమైన చర్య…

విశాలాంధ్ర – కొయ్యలగూడెం : దళిత ఎమ్మెల్యేల పై వైసీపీ గుండాల దాడి హేయమైన చర్య అని టిడిపి మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ కులమత బేధాలు లేకుండా సమాన హక్కులు కలిగి ఉండాలని రాజ్యాంగాన్ని రచించినప్పటికీ దళితుల మనోభావాలు దెబ్బ తినే విధంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలు దళితులపై రోజురోజుకు ఎక్కువవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి ఎమ్మెల్యే డొల బాల వీరాంజనేయ స్వామి పై అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి దాడి చేయించడం దుర్మార్గమన్నారు. జీవో నం. 1పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న పోరాటం, అంగన్వాడీలు చేస్తున్న పోరాటాల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ గూండాలు నీచానికి దిగుతున్నారన్నారు. నాలుగు దశాబ్దాలుగా శాసనసభ్యుడిగా ఉన్న టిడిపి సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి మీద వెల్లంపల్లి శ్రీనివాస్ దురుసు ప్రవర్తనను ఖండిస్తున్నామని నరేష్ పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడంతో వైసీపీ ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతున్నారని, రాబోయే రోజుల్లో వైసీపీ నాయకులకు రాష్ట్ర ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో, దళితులకు, మహిళలకు రక్షణ కరువైందని, డోల బాల వీరాంజనేయ స్వామి పై జరిగిన దాడిని నరేష్ తీవ్రంగా ఖండించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img