విశాలాంధ్ర= ఏలూరు : మదర్ తెరిసా వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ దినేష్ సూర్యకు పాండిచ్చేరికి చెందిన ప్రముఖ జి హెచ్ పి విశ్వవిద్యాలయం సామాజిక సేవలో డాక్టరేట్ ప్రకటించింది. గురువారం ఆహ్వానంతో పాటు, డాక్టరేట్ సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేసింది. అంధులకు పరీక్షలను వ్రాయించడం, పనులు చేసుకునే ఆడపిల్లలకు ఉచితంగా విద్య అందించడం, ప్రతి నెల ఆహారం పంపిణీ , వికలాంగులకు సహాయ సహకారాలు అందించడం తదితర అంశాలలో మెరుగైన ప్రతిభను ప్రదర్శించడం కారణంగా డాక్టరేట్ ఇచ్చినట్లు కమిటీ ప్రకటించింది. ఈనెల 25న తమిళనాడు, పాండిచేర్లకు చెందిన ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయ అధికారులు డాక్టరేట్ ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దినేష్ సూర్యను మదర్ తెరిసా సొసైటీ అదనపు డైరెక్టర్ పొలిమేర కిరణ్, డిప్యూటీ డైరెక్టర్ చిరంజీవి, పలువురు అభినందించారు.