Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

పాలకుల నిర్లక్ష్యంతో ప్రజల అవస్థలు

ఏలూరు:పాలకుల నిర్లక్ష్యం కారణంగా జిల్లా కేంద్రమైన ఏలూరు నగర ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఏలూరు అసెంబ్లీ నియోజక
టిడిపి ఇంఛార్జి బడేటి చంటి ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం కురిసిన భారీ వర్షానికి జలమయమైన పలు ప్రాంతాల్లో టిడిపి నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా చూసిన బడేటి చంటి వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు.వైసిపి ప్రభుత్వ హయాంలో అన్ని కష్టాలేనని పలువురు తమ ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ నగరంలోని పల్లపు ప్రాంతాలతో పాటు నడిబొడ్డున ఉన్న ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, ఇళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా నీట మునగటం ఎప్పుడు జరిగలేదని పేర్కొన్నారు. పాలకులకు ముందుచూపు లేకపోవటం వల్ల డ్రైన్స్ లోని సిల్ట్ ను తొలగించడం, నీటిపారుదల సక్రమంగా ఉండేవిదంగా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఎక్కడ చూసినా డ్రైన్స్ పూడికపోయి వర్షపు నీరు ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అవినీతి
వాటాల్లో పోటీపడుతున్న కార్పొరేషన్ పాలకులు, అధికారులకు నగర ప్రజల సమస్యలు పరిష్కరించే తీరిక లేకుండా పోయిందని విమర్శించారు. జిల్లా కేంద్రాన్ని కార్పొరేషన్ అని చెప్పుకోవడమే తప్ప దానికనుగుణంగా అభివృద్ధి చేయాలన్న తపన పాలకులకు లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షపు నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక సిద్దం చేయాలని బడేటి చంటి డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img