Sunday, June 11, 2023
Sunday, June 11, 2023

పౌష్టిక ఆహారంతో విద్యార్ధులకు జ్ఞాపకశక్తి మెరుగుదల….

విశాలాంధ్ర – తాడేపల్లిగూడెం రూరల్ : కోడిగుడ్డు, చిక్కీలు, రాగిజావ లాంటి బలమైన పౌష్టిక ఆహారం అందించడం ద్వారా విద్యార్థులలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని తాడేపల్లి గ్రామ సర్పంచ్ పోతుల అన్నవరం అన్నారు. మంగళవారం తాడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న గోరుముద్ద పధకంలో భాగంగా విద్యార్థులకు రాగి జావ అందించే కార్యక్రమాన్ని సొసైటీ ప్రెసిడెంట్ పరిమి తులశీదాస్తో కలిసి ఆయన ప్రారంభించారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు షేక్ లాల్ బీబీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సర్పంచ్ పోతుల అన్నవరం మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న నాణమైన విద్యను పౌష్టిక ఆహారాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు సాధించాలని అన్నారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వం విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తుందన్నారు. సొసైటీ ప్రెసిడెంట్ తులసీదాస్ మాట్లాడుతూ నాడు నేడు పధకం ద్వారా ప్రభుత్వం విద్యార్థులకు పాఠశాలలో అన్ని మౌళిక వసతులు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆయన సూచించారు. వచ్చే నెలలో జరిగే 10వ తరగతి పరీక్షలలో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి ఎస్. రవిచంద్ర, వెల్ఫేర్ అసిస్టెంట్ సురేష్ కుమార్, ఉపాధ్యాయులు కె.వి.ఎస్. రామాంజనేయులు, మేరీ పుష్ప, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ బొల్లం వెంకటేశ్వరరావు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img