విశాలాంధ్ర- కొయ్యలగూడెం:వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు ముఖ్యమైనవి. వీటిని పిల్లలు పెద్దలు వయసుతో సంబంధం లేకుండా అందరూ అమితంగా ఇష్టపడతారు. ఇవి కల్తీ లేనివి, మండుటల నుండి మంచి తాటి ముంజలు ఉపశమనం కలిగిస్తాయి. వేసవి వచ్చిందంటే చాలు మన అందరి దృష్టి తాటి ముంజలను ఆకర్షిస్తుంది. తాటి ముంజలు తింటే ఆ మజాయే వీటివల్ల శరీరానికి చల్లదనమే కాదు కీలకమైన పోషకాలు కూడా పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నా ప్రస్తుతం నగరాలలో కూడా లభ్యం వేసవికాలంలో లభ్యం అవుతున్నాయి.
తాటి ముంజల వలన ప్రయోజనాలు…
వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని నీరు ఎక్కువ ఖర్చవుతుంది. దీంతో డిహైడ్రేషన్ బారిన పడతాం. ఇలాంటి పరిస్థితులు తాటి ముంజలను తీసుకుంటే శరీరంలోనికి ద్రవాలు చేరి డిహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. శరీరం వేడిగా ఉండే వ్యక్తులు వేసవిలో తాటి ముంజలను తింటే ఫలితం ఉంటుంది. తాటి ముంజలలో పొటాషియం శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రం అవుతుంది.
వేసవిలో తాటి ముంజలు జీవనాధారం…
వేసవికాలం వచ్చిందంటే బోడిగూడెం, మంగపతి దేవి పేట, గ్రామాలకు చెందిన గ్రామీణ ప్రాంత ప్రజలు వారి పొలాలలో ఉన్న తాడి చెట్ల నుండి పండే ముంజు కాయల గెలలను మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణం తీసుకువచ్చి విక్రయిస్తూ ఉంటారు. తాటి ముంజులను తీసుకువచ్చి విక్రయించే వ్యాపారస్తుడు మెంటే సుబ్బారావు మాట్లాడుతూ ఉదయానే లేచి తాడి చెట్లు ఎక్కి తాటి ముంజులను కోసి కొయ్యలగూడెం పట్టణం తీసుకువచ్చి తాటికాయలోనుండి ముంజులను తీసి డజను( 12 ముంజులు) 50 రూపాయలకు విక్రయించడం జరుగుతుందన్నారు.కుటుంబ పోషణ కోసం చిరు వ్యాపారం చేయడం జరుగుతుందన్నారు. తాటి ముంజులు తినడం వలన ఎండాకాలం మనిషి ఒంటిలో వేడి లేకుండా చలువ చేయడం జరుగుతుందని పేర్కొన్నాడు.