Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

రాష్ట్రంలో వైసిపి అరాచక పాలన…

టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి బడేటి చంటి….
విశాలాంధ్ర`ఏలూరు :
రాష్ట్రంలో వైసిపి అరాచక పాలన కొనసాగిస్తుందని టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ధ్వజమెత్తారు. టిడిపి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం లో భాగంగా ఏలూరు 34 వ డివిజన్‌ పవర్‌ పేటలో సోమవారం నిర్వహించిన రచ్చబండలో బడేటి చంటి పాల్గొన్నారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచాల్సిన ప్రభుత్వం వారికీ జీవన్మరణ సమస్యలు సృష్టిస్తోందని దుయ్యబట్టారు. గతంలో ముఠా కార్మికులకు చేతినిండా పని ఉండడం వల్ల సుఖంగా జీవించేవారని, ప్రస్తుతం వారికీ సరైనవిధంగా పనులు లేకపోవడం వల్ల జీవనం సాగడమే దుర్భరంగా మారిందన్నారు. గతంలో ముఠా కార్మికుడు తన పనిని అమ్ముకుంటే రూ.5 లక్షలు వచ్చేవని, దీనితో అతనికి జీవిత భద్రత ఉండేదని చెప్పారు. ప్రస్తుతం వై. సి. పి పాలన లో పనులు లేక బ్రతకటమే కష్టంగా మారిందని ముఠా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బడేటి చంటి పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ అసమర్ధ విధానాల వలన నష్టం చేకూరిందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం సామాన్యుల జీవనస్థితిగతులు మార్పు చేసేందుకు ప్రయత్నించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రజల చేతుల్లో పరాభవం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ డిప్యూటీ మేయర్‌ చోడే వెంకటరత్నం, డివిజన్‌ ఇంచార్జ్‌ దాకారపు రాజేశ్వరరావు , మాజీ కౌన్సిలర్‌ జోగి నరేంద్ర కుమార్‌, నౌడూరి వాసు, శిర్ల వాసు, కొయ్య అప్పల రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img