Friday, March 24, 2023
Friday, March 24, 2023

వాలంటీర్లు..వైసిపి కార్యకర్తలమని ధైర్యంగా చెప్పుకోండి…

జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్..

విశాలాంధ్ర – పాలకొల్లు: వైసిపి కార్యకర్తలుగా పనిచేస్తున్నారంటూ ఇటీవల ప్రతిపక్షాల నుండి కామెంట్లు వినిపిస్తున్నాయని కామెంట్ చేసే వారికి గుణపాఠం కలిగేలా వలంటీర్లు ధైర్యంగా వైసిపి కార్యకర్తలమని నిర్భయంగా చెప్పుకోవాలని జడ్పీ చైర్మన్, పాలకొల్లు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ కవురు శ్రీనివాస్ వాలంటీర్లకు సూచించారు. ఎందుకంటే ఒక ఆదర్శవంతమైన ప్రభుత్వ పరిపాలనలో ఉన్నామనే విషయం ప్రతి వాలంటీర్ గుర్తించుకోవాలన్నారు. పాలకొల్లు వైసిపి కార్యాలయంలో గురువారం జరిగిన ఒక అవగాహన సదస్సు లో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img