విశాలాంధ్ర- చింతలపూడి: విద్యార్థులకు జీవన నైపుణ్యాలు, లక్ష్యాలపై అవగాహన కల్పించినట్లు పడాల చారిటబుల్ ట్రస్ట్ సీఈవో పడాల సూర్యప్రసాద్ తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు మాటూరు చక్రధర్ రావు అధ్యక్షతన స్కూలు ఆఫ్ ఎక్సలెంట్ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల పూర్వ విద్యార్థులు బండి శ్రీకాంత్, పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు కస్తూరి, పడాల చారిటబుల్ ట్రస్ట్ స్పెషల్ ఎక్స్లెన్స్ ప్రోగ్రాం ఎంచుకొని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పడాల సూర్యప్రసాద్ మాట్లాడుతూ తమ ట్రస్టును 2002లో ప్రారంభించామని తెలిపారు. పేద విద్యార్థులకు విద్యా విధానములో ఉన్న లోటుపాట్లను సరిజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలను రూపొందించా మన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా లేవా అని పరిశీలించడానికి నలుగురు రిసోర్స్ పర్సన్స్ వచ్చి ఉదయం నుండి 7, 8,9 విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, కే సుజాత, ఝాన్సీ రాణి, కమలా ప్రియదర్శిని, విజయానంద్, భార్గవి, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.