Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవికి సత్కారం

విశాలాంధ్ర- ముదినేపల్లి : వైద్య విద్యార్థిని అమరావతి మాజీ అంబాసిడర్ అంబుల వైష్ణవిని ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ భీమవరం ఘనంగా సత్కరించారు. ముదినేపల్లికి చెందిన ప్రముఖ వైద్యులు ఆంబుల మనోజ్ కుమార్తె వైష్ణవి సామాజిక సేవలకు గుర్తింపుగా ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల , లయన్స్ క్లబ్ భీమవరం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వైష్ణవిని శాలువ , మెమెంటో, ప్రశంసాపత్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఐ మోహన వంశీ , లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాజేష్ , కళాశాల అధ్యక్షులు సాగి ప్రసాదరాజు , ప్రిన్సిపాల్ ఎం జగపతిరాజు , లయన్స్ క్లబ్ ప్రతినిధులు , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img