Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

సామాజిక చైతన్య వేదిక ఆర్గనైజర్ ఇవి శ్రీనివాసరావు…

విశాలాంధ్ర -చాట్రాయి: శివపురం, చిన్నంపేట గ్రామాల మధ్య ఉన్న తమ్మిలేరు పై హైలెవల్ బ్రిడ్జి నిర్మించి గ్రీన్ ఫీల్డ్ హైవే కి అనుసంధానం చేయాలని కోరుతూ సామాజిక చైతన్య వేదిక ఆర్గనైజర్ యి.వి‌. శ్రీనివాసరావు స్పందనలో వినతిపత్రం అందజేశారు. సోమవారం చాట్రాయి తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న స్పందనలో చాట్రాయి తహశీల్దార్ విశ్వనాథ రావు కి ఆయన వినతిపత్రం అందజేశారు ‌. అనంతరం ఆయన మాట్లాడుతూ పూర్వం రోజులలో సుమారు 30 సంవత్సరాల క్రితంవర్షాల ప్రభావం వలన రాత్రి వేళ్ళలో చిన్నంపేట గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు శివపురంలో వరినాట్లు వేసి వెనుతిరిగి వెళ్ళుతుండగా చీకటిలో వరద ఉధృతి కావడంతో వ్యవసాయ కూలీలు కొట్టుకుపోయి చనిపోయారని తెలిపారు.దానిపై స్పందించిన దివంగత నేత మాజీ మంత్రి కోటగిరి విధ్యాదరరావు వ్యక్తి గత బాధ్యతగా తీసుకుని కాజ్ వేల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు.మారుతున్న కాలమాన పరిస్థితులు వరదలు ఉధృతి కి వర్షాకాలంలో చిన్నంపేట వైపు రోడ్డు కి పెద్ద గళ్ళు పడటం ఒక ఆనవాయితీ గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు దాని నిర్మాణం అసంపూర్తిగానే ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే చిన్నంపేట కాజ్ వే వద్దనుండి కేవలం 9కిలోమీటర్ల దూరం లో గ్రీన్ ఫీల్డ్ హైవే జాతీయ రహదారి పనులు ప్రారంభం అయ్యాయని,
చిన్నంపేట తమ్మిలేరుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తే అటు నేషనల్ హైవే కి , సరిహద్దులో వున్న తెలంగాణ రాష్ట్రానికి ప్రయాణ సౌకర్యం,రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుందన్నారు. సమస్య ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img