విశాలాంధ్ర -తాడేపల్లిగూడెం రూరల్:స్మశాన వాటికలో సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించే వే బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే నిలుపుదల చేయాలని కోరుతూ మంగళవారం జనసేన అధ్యక్షుడు చిక్కాల శ్రీనివాసు ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన తెలియజేశారు. ఎంపీటీసీ ఉప్పు నరసింహమూర్తి, ఉప సర్పంచ్ గోపిశెట్టి వెంకటరాయుడు ఈ నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా చిక్కాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటికే తమ గ్రామంలో వారే ప్రాంతాల నుంచి వచ్చిన లారీలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇరుకు రోడ్డు అందులోనూ స్మశాన వాటికలో వే బ్రిడ్జి నిర్మించడం వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. సొసైటీ అధికారులు వెంటనే స్పందించి వే బ్రిడ్జి నిర్మాణం పనులు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉప సర్పంచ్ గోపిశెట్టి వెంకటరాయుడు మాట్లాడుతూ పంచాయతీ తీర్మానం లేకుండానే వే బ్రిడ్జి నిర్మాణం పంచాయతీకి సంబంధించిన స్థలంలో నిర్మాణం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అడపా నరేష్, కూడవల్లి వెంకట శ్రీనివాస్ , గోపిశెట్టి రమేష్, బాదం రాము, కామిశెట్టి శివ, కూడవల్లి ప్రసాద్, కొండపల్లి జయ, తిరుమల వెంకటకృష్ణ, ఉప్పు మణికంఠ, బాదం శ్రీను, బాలం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.