Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అక్టోబర్‌ విప్లవస్ఫూర్తితో పోరాటాలను కొనసాగించాలి…

సీపీిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సీపీిఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు…
విశాలాంధ్ర`ఏలూరు: అక్టోబర్‌ విప్లవస్పూర్తితో పోరాటాలను కొనసాగించాలని సీపీిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఏలూరు ఏరియా ఆధ్వర్యంలో 1917 అక్టోబర్‌ లో జరిగిన మహత్తర అక్టోబరు సోషలిస్టు ఉద్యమ విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారుఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సీపీఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా మహత్తర అక్టోబర్‌ సోషలిస్టు విప్లవం అత్యంత ప్రభావాన్ని ప్రపంచం మీద చూపించిందని కొనియాడారు.
అనేక దేశాలు అక్టోబర్‌ సోషలిస్టు విప్లవస్ఫూర్తితో సోషలిస్టు,కమ్యూనిస్టు దేశాలుగా ఏర్పడ్డాయని అంతటి గొప్ప స్ఫూర్తితో భారతదేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి దేశ స్వాతంత్రం కోసం అలుపెరగని పోరాటం చేసిందని గుర్తు చేశారు. నేడు స్వాతంత్రం సాధించి 75 యేళ్లు గడిచినా ఇంకా నిరుద్యోగం, ఆర్ధిక అసమానతలు, శ్రమదోపిడి, మతోన్మాదం వంటి అనేక విచ్ఛిన్నకర శక్తులు దేశ అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారాయని, వాటిపై కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు.దోపిడీ రహిత సమసమాజ స్థాపనకు కమ్యూనిస్టు పార్టీ పోరాడుతుందని ఆ పోరాటంలో అక్టోబర్‌ సోషలిస్టు విప్లవ స్ఫూర్తిని ప్రేరణను కొనసాగిస్తూ ఉద్యమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సీపీిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల కన్నబాబు, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కడుపు కన్నయ్య, మావూరి విజయ, కొల్లూరి సుధారాణి, పోలా భాస్కరరావు, తెర్లాపు శ్రీను, కురెళ్ళ వరప్రసాద్‌, సాయన బాలు, గన్ను వెంకట్రావు,ఉప్పులూరి రవి, వీర్ల జగన్నాథం, యర్రా వెంకటేశ్వరరావు,కనకం జగన్మోహన్రావు, ఎం.ఏ హకీమ్‌, అజీజ్‌,గొర్లి స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img