Friday, April 19, 2024
Friday, April 19, 2024

అభివృద్ధిని విస్మరించిన ముఖ్యమంత్రి జగన్‌…

టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి బడేటి చంటి….
విశాలాంధ్ర`ఏలూరు : రాష్ట్రంలో మూడున్నర ఏళ్లుగా ప్రజా సంక్షేమాన్ని, ప్రజా సమస్యలను, అభివృద్ధిని పట్టించుకోకుండా అరచేతిలో వైకుంఠం చూపుతున్న వైసిపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు అన్నివర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం టిడిపి ఇంచార్జి బడేటి రాధాకృష్ణయ్య(చంటి) స్పష్టం చేశారు. టిడిపి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలో 13వ డివిజన్‌ వైఎస్‌. ఆర్‌ కాలనీ లో బడేటి చంటి పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 14 అంశాల్లో ప్రజాభిప్రాయాన్ని స్వీకరించారు. ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని మాయమాటలు చెపుతున్న జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వాస్తవాలను గుర్తించాలని హితవు పలికారు. ప్రతి ఇంటిలోనూ సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. వైసిపి పాలనలో ప్రజలకు స్వేచ్చ లేకుండా పోయిందనడానికి తాజాగా నగరంలో గడప గడపకు కార్యక్రమంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు నిదర్శనంగా నిలుస్తాయని బడేటి చంటి పేర్కొన్నారు. సమస్యలు చెప్పినవారిని బెదిరించి పార్టీ భజన చేయిస్తున్నారని మండిపడ్డారు. అన్నివర్గాలు ఏకమై వైసిపి ని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. రాష్ట్రానికి పట్టిన ఖర్మ పోయి మంచి రోజులు రావాలంటే చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ ఇంచార్జి మెరుగుమాల శ్రీనివాస్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ చోడే వెంకటరత్నం, నాయకులు గొంగడి సాంబశివరావు, దావుద్‌, శేఖర్‌, యేసు, లక్ష్మణరావు, నెరుసు వెంకట్రావు, టైలర్‌ రాజు, వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img