Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఆధునిక సాంకేతికతలో డేటా ఇంజనీరింగ్ కీలక పాత్ర….

జే ఎన్ టి యు ఉప కులపతి డా.జి వి అర్ ప్రసాదరాజు…

విశాలాంధ్ర- తాడేపల్లిగూడెం: ఆధునిక సాంకేతికతలో డేటా ఇంజనీరింగ్ దే కీలకపాత్ర అని జే ఎన్ టి యు ఉప కులపతి జి.వి.ఆర్ ప్రసాదరాజు అన్నారు.అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఎఐసిటిఇ) , న్యూఢిల్లీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శ్రీవాసవి ఇంజనీరింగ్ కళాశాల అర్ అండ్ డి విభాగ ఆధ్వర్యంలో డేటా ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పై రెండు రోజుల జాతీయ కాన్ఫరెన్స్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. కళాశాలలో శుక్రవారం ఉదయం నిర్వహించిన కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జే ఎన్ టి యు కె విశ్వ విద్యాలయం ఉప కులపతి డా.జి.వి.అర్ ప్రసాదరాజు సదస్సును ప్రారంభిస్తూ ముఖ్య ఉపన్యాసం చేసారు. ఆధునిక సాంకేతికతలో డేటా ఇంజనీరింగ్ చాలా కీలకం కానుందని అటువంటి దానిని తీసుకుని రెండు రోజుల పాటు జాతీయ సదస్సును నిర్వహించడం హర్షణీయమన్నారు. జే ఎన్ టి యు కాకినాడ విశ్వ విద్యాలయం కూడా సాంకేతిక విద్యలో వస్తున్న మార్పులను గమనిస్తూ ఎప్పటి కప్పుడు మార్పులు చేసుకుంటూన్నామన్నారు. ఇటీవల జర్మనీలో జరిగిన గ్లోబల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ లో రాష్ట్ర ఉన్నత విద్యా మండలితో కలిసి పాల్గొనడం జరిగిందని దానిలో భాగంగా పలు అంతర్జాతీయ విద్యా సంస్థలతో అవగాహన ఒప్పందాలను చేసుకోవడంతో పాటు వాటిని విశ్వ విద్యాలయ అనుబంధ కళాశాలలకు అందించి విద్యార్థుల ఉన్నతికి దోహదమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిలికాన్ వ్యాలీ విశ్వ విద్యాలయంతో కూడా అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగిందని, దానిలో భాగంగా 100 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తరువాత పోస్టు గ్రాడ్యుయేషన్ విదేశంలో చేసుకునే వీలు కల్పించడం జరిగిందన్నారు. ఆయా విదేశీ విశ్వ విద్యాలయలతో చేసుకున్న ఒప్పందాల వల్ల విద్యార్థులకు అంతర్జాతీయ సంస్థలతో పాటు స్వదేశి సంస్థలలో ఉన్నత ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. డేటా ట్రాన్స్ఫర్ రంగంలో అభివృద్ధి కోసం జరుగుతున్న పరిశోధనలలో డేటా ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ టెక్నాలజీ లు ప్రముఖ పాత్రను పోషిస్తున్న తరుణంలో అయా రంగాలలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటిని అధిగమించేందుకు ఇలాంటి సదస్సులు ఉపయోగ పడతాయన్నారు. సదస్సులో పాల్గొన్న అధ్యాపకులు శ్రద్ధతో తాము తెలుసుకున్న అంశాలను విద్యార్థులకు అందించాలన్నారు. కళాశాల పాలక వర్గ కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యాలో వస్తున్న మార్పులకనుగుణంగా నూతన కోర్సులలో అధ్యాపకులు శిక్షణ పొందే విధంగా ఈ జాతీయ సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రత్నాకర్ రావు, టెక్నికల్ డైరక్టర్ చెక్కా అప్పారావు, కాన్ఫరెన్స్ అధ్యక్షులు డాక్టర్ వి. ఎస్. నరేష్, కో కో -ఆర్డినేటర్ డాక్టర్ తామారాయ్ తదితరులు ప్రసంగించారు. సదస్సు తొలి రోజు సెషన్ లో ఐ ఐ ఎస్ సి బెంగళూరు ప్రొఫెసర్ ఎన్. విశ్వనాథన్, ఆంధ్ర విశ్వ విద్యాలయం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ వల్లి కుమారి, జే ఎన్ టి యు కె ఇంజనీరింగ్ కళాశాల, కాకినాడ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. హెచ్. ఎం. కృష్ణ ప్రసాద్ , ఐ ఐ టి భువనేశ్వర్ ప్రొఫెసర్ డాక్టర్ పి. విజయ శంకర్ రావు తదితరులు తమ ప్రసంగాలను అందించారని కాన్ఫరెన్స్ చైర్ డాక్టర్ నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ఇంజనీరింగ్ విభాగాల అధిపతులు, అధ్యాపకులు సదస్సులో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img