Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆరవల్లి గ్రామదేవతల ఆలయాన్ని తొలగించం…

విశాలాంధ్ర – ఏలూరు: అత్తిలి మండలం ఆరవల్లి గ్రామదేవతల దేవాలయమునకు వచ్చిన ముప్పేమీ లేదని, వాటి జోలికి ప్రభుత్వం వెళ్లడం లేదని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుకు లిఖితపూర్వకంగా ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినప్పటికీ కొంతమంది స్వార్థపర రాజకీయ నాయకులు గ్రామ దేవత ఆలయాన్ని తొలగించాలని ప్రయత్నాలు కొనసాగిస్తుండడంతో ఒకవేళ ప్రభుత్వ అధికారులు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిస్తూ ఏపి, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టు న్యాయవాది గొట్టుముక్కల రోనాల్డ్ రాజ్ ద్వారా ట్రస్టీ రామలక్ష్మి నోటీసు జారీ చేయించారు. ఈ సంఘటన పూర్వపరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆరవల్లి గ్రామంలో గత 125 సంవత్సరాలుగా గ్రామ దేవతలైన కనకదుర్గమ్మ, మావుళ్ళమ్మ, మహంకాళమ్మ, మారమ్మ, చెవులమ్మ రక్షణలో ఉంటూ వారి గౌరవం అప్పటి ట్రస్ట్లు 125 సంవత్సరాల క్రితం మూడు దేవాలయాలను నిర్మించి ప్రతి ఏడాది ప్రజల రక్షణ అర్థం గ్రామదేవతల ఆశీర్వాదం పొందటానికి పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపటం సాంప్రదాయంగా మారింది. గ్రామం నడిబొడ్డున వెలసిన పుట్టిల్లు గ్రామ దేవతను కొంత కాలం నుంచి ఊరి పొలిమేరలో ఉన్న రెండు దేవాలయాలకు తరలించడం ఆ గ్రామ ప్రజల సాంప్రదాయంగా వస్తుంది. ఈ సాంప్రదాయం కొనసాగింపుగా ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మాసాలలో పుట్టింటి ఉత్సవాలు జరపడం, తదుపరి లాంఛనాలతో అమ్మవార్లను పొలిమేరలో ఉన్న దేవాలయాలలో ప్రతిష్టించడం జరుగుతున్న సందర్భంలో కొంతమంది స్వార్థపర రాజకీయ నాయకుల కళ్ళు గ్రామ నడిబొడ్డిలో విరాజుల్లుతున్న అమ్మవార్ల పుట్టినిల్లు గుడిపై కన్ను పడింది. తమ భూములను అధిక రేట్లకు వచ్చే విధంగా వారి ఎదురుగా ఉన్న గుడి అరిష్టంగా భావించి 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పుట్టినిల్లు దేవాలయాన్ని పడగొట్టాలని ప్రయత్నాలు ప్రారంభించారు. రోడ్డు వెడల్పు చేసే నెపంతో ప్రయత్నాలు ముమ్మరం చేయగా గుడి ట్రస్ట్ అయినా కర్రీ రామలక్ష్మి ఏలూరు కు చెందిన హైకోర్టు న్యాయవాది గొట్టుముక్కల రోనాల్డ్ రాజు ద్వారా ఏపీ హైకోర్టులో రిప్విటేషన్ దాఖలు చేశారు. రెవెన్యూ, పంచాయతీ, పురావస్తు, దేవాదాయ శాఖ, ఆర్ అండ్ బి శాఖల అధికారులకు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం తరఫున భీమవరం ఆర్ అండ్ బి శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆరవల్లి గ్రామ నడిబొడ్డున 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పరావస్తు పుట్టిల్లు దేవాలయాన్ని పడగొట్టే ఉద్దేశం, అక్కడ నుంచి తరలించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదంటూ లిఖితపూర్వకమైన హామీ పత్రాన్ని హైకోర్టుకు సమర్పించారు. దీనిని రికార్డు చేసి దేవాలయానికి ఏమి ఉప్పు లేదని ఈ ఏడాది మార్చి 14వ తేదీన హైకోర్టు విచారణ ముగించింది. ట్రస్టీ అయిన కర్రి రామలక్ష్మి తన వృద్ధాప్యంలో ఉండి కూడా 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పురావస్తు దేవాలయాన్ని కాపాడిన విధానాన్ని ఆరవల్లి గ్రామ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేసి ఆమె ప్రయత్నాన్ని కొనియాడారు. అయితే కొందరు స్వార్ధపర రాజకీయ నాయకులు తమ ప్రయత్నాలు విఫలం అయ్యాయని వెనకడుగు వేసినట్లు వేసి, మరలా తమకున్న రాజకీయ పలుకుబడితో అధికారులను తప్పుదోవ పట్టించి ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన హామీని కూడా తొంగలో తొక్కే విధంగా వ్యవహరిస్తున్నారని ట్రస్టీ ఆరోపించారు. అమ్మవారి పుట్టిల్లు దేవాలయాన్ని కూలగొట్టటానికి లేదా తరలించే ప్రయత్నం మొదలుపెట్టారు అనే సమాచారంతో ట్రస్ట్ రామలక్ష్మి ఆలయాన్ని కాపాడాలనే దృఢ నిశ్చయంతో తన తరపు హైకోర్టు న్యాయవాది గుర్తుముక్కల రోనాల్డ్ రాజు ద్వారా హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే ఆర్ అండ్ బి అధికారులపై కోర్టు ధిక్కారణ గ్రంథం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఈ నెల 4వ తేదీన నోటీసులు జారీ చేయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img