Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు…

విశాలాంధ్ర- భీమవరం: ఇంటర్ మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. కృష్ణవేణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలోని తన ఛాంబరు లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో డి ఆర్ ఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24వ తేది నుంచి జూన్ 1 వ తేదీ వరకు 35 కేంద్రాలలో ఉదయం గం.9 నుండి మధ్యాహ్నం 12.వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం గం.2.30 నుండి సాయంత్రం 5.30 వరకు రెండవ సంవత్సరం పరీక్షల నిర్వహించడం జరుగుతుందని డి ఆర్ వో తెలిపారు.పశ్చిమగోదావరి జిల్లాలో ఇంటరు మీడియట్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులకు పలు మార్గదర్శకాలను ఆమె అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్లు, ఫర్నిచర్, తదితర మౌలిక సదుపాయాలను మరోసారి పరిశీలించు కోవాలన్నారు.ఏ విద్యార్థి కూడా నేల మీద కూర్చుని పరీక్షలు రాయకూడదని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు.
వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పరీక్షా కేంద్రాల్లో ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి ఆశా, ఏఎన్ఎం లను నియమించడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు కోవిడ్ కు సంబందించిన మాస్క్ లు, శాని టైజర్ లు అందరికీ సరిపడేలా అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. ఆర్టీసీవారు విద్యా ర్థులకు పరీక్ష సమయానికి హాజర య్యేందుకు అనువైన సమయాల్లో సౌకర్యవంతంగా బస్సులను ఏర్పాటు చేయాల న్నారు . పంచాయతీ, మున్సిపల్ అధికారులు పరీక్ష కేంద్రాలు వద్ద రక్షిత మంచి నీరు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. పోలీస్ అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో జిరాక్స్ షాపులు, కంప్యూటర్ సెంటర్ లు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారి కె.కృష్ణ వేణి ఆదేశించారు.ఈ సమావేశంలో ఆర్ ఐ ఓ చంద్ర శేఖర్ బాబు , డి యల్ పి ఓ ఎం. నాగలత , పోలీస్ అధికారులు, ఏపీ ఈపీడీసీఎల్ ఏ ఈ , పోస్టల్ అధికారులు, మున్సిపల్ అధి కారులు,తదితర శాఖల అధి కారులు , తది తరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img