Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఉద్యానవన శాస్త్ర పుస్తకాలతో బుక్ బ్యాంక్ ఏర్పాటు

విశాలాంధ్ర – తాడేపల్లిగూడెం రూరల్: ఉద్యానవన విశ్వవిద్యాలయం లో విధులు నిర్వహించి, పదవీ విరమణ చేసిన శాస్త్రవేత్తలు అధికారులు ఇచ్చిన ఉద్యానవన శాస్త్ర పుస్తకాలతో బుక్ బ్యాంకు ఏర్పాటు చేశామని యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ టీ. జానకి రామ్ అన్నారు గత శాస్త్రవేత్తలు అధికారులు సాధించిన ఆవిష్కరణలు, రైతులకు ఉపయోగపడే సూచన సలహాలు, విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధిని పెంపొందించేందుకు ఉపయోగపడే విధంగా బుక్ బ్యాంకు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉద్యానవన శాఖ వివిధ శాఖల అధికారులను కోరడంతో పలువురు శాస్త్రవేత్తలు గురువారం బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్ లర్ జానకిరామ్ మాట్లాడుతూ డా. శ్రీహరి, డా. జె. దిలీప్ బాబు, డా. ఏ సుజాత, డా. ఆర్ వి ఎస్ కే రెడ్డి, డా.కే ఉమా జ్యోతి, డా.రాజా మన్నార్, డా. ఈ వి ఎస్ ప్రకాష్ రావు లు స్పందించి సుమారు 500 అరుదైన పుస్తకాలు అందజేశారని తెలిపారు. విద్యార్థులు ఈ పుస్తకాలను సద్విని చేసుకొని నైపుణ్య అభివృద్ధిని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. విదేశాల్లో,దేశవ్యాప్తంగా ఉన్న వివిధ హోదాల్లో పనిచేసిన శాస్త్రవేత్తల నుంచి పుస్తకాలు విరాళల రూపంలో స్వీకరించి బుక్ బ్యాంకులో అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. పుస్తకాలను ఆన్ లైన్ చేసి విద్యార్థులకు అందుబాటులో ఇస్తామని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు వీటిని వినియోగించుకుని భవిష్యత్తు తరాల ప్రజలకు అవసరమైన ఆవిష్కరణలకు బాటలు వేసుకోవాలని కోరారు. బుక్ బ్యాంకు ఏర్పాటుకు కృషి చేసిన అధ్యాపకులు శాస్త్రవేత్తలు విద్యార్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్టార్ డా. బి శ్రీనివాసులు, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డా. డి వెంకట్ స్వామి, డీన్ అఫ్ పీజీ స్టడీస్ డాక్టర్ కె.ధనుంజయరావు, పద్మావతమ్మ, సలోమి, నారం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img