Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి…

ఎమ్మెల్యే రామరాజు….

విశాలాంధ్ర-ఉండి : స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా ఉండి పార్టీ కార్యాలయంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కాగిత సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే, శివ స్వచ్ఛంద సేవా సంస్థల చైర్మన్ వేటూరి వెంకట శివరామరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు తదితర నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరాజు,మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేయబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని వారన్నారు. బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి లక్ష్యంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని వారి అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడ్డారని వారు గుర్తు చేసుకున్నారు. నేడు రాష్ట్రంలో పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉన్నదని వారన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అప్పుడే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని అందుకు అనుకూలంగా ప్రతి నాయకుడు,కార్యకర్త కలిసి పనిచేయాలని వారు సూచించారు చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయడమే మన ముందున్న లక్ష్యం అని వారు తెలియజేశారు. అనంతరం వృద్ధులకు, పేదలకు పండ్లు, దుప్పట్లు నాయకులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాగిత మహంకాళి, కందుల బలరాముడు, జుత్తుగ శ్రీనివాస్ ,మాజీ సర్పంచ్ రంప సౌలు రాజు, రుద్రరాజు సూర్యనారాయణ రాజు, మండల కార్యదర్శి కిన్నెర వెంకన్న, మోపిదేవి శ్రీనివాస్, కునుకు శ్రీనివాస్, మంతెన సాయి లచ్చిరాజు, ముదునూరి కృష్ణంరాజు, ఉండ్రు అబ్రహం, గొల్ల విక్టర్ బాబు, జీవి సత్యనారాయణ, మజ్జి కృష్ణ ప్రసాద్, తదితర నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాలకోడేరు, ఆకివీడు, కాళ్ళ మండలాల్లో కూడా మండల పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మంతెన రామరాజు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉండి పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, టిడిపి అభిమానులు ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని ఎన్టీఆర్ విగ్రహం ముందు ప్లే కార్డ్స ప్రదర్శించి రాష్ట్రానికి ఇదేం కర్మ అని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పాలకోడేరు, కాళ్ల, ఆకివీడు మండలాల్లో మండల పార్టీ అధ్యక్షులు అధ్యక్షతన నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రామరాజు పాల్గొని ఎన్టీ రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వృద్ధులకు, పేదలకు పండ్లు దుప్పట్లు నాయకులు చేతుల మీదుగా పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img