Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కుప్పకూలిన 50 ఏళ్ల నాటి అన్నవరం డ్రైన్ వంతెన….

డ్రైన్ లో పడిన లోడు లారీ తప్పిన పెను ప్రమాదం..

విశాలాంధ్ర-ముదినేపల్లి : ఫిష్ ట్యాంకులకు చేప పిల్లల లోడుతో వెళుతున్న లారీ వంతెన దాటుతుండగా ఒక్కసారిగా వంతెన నడిమికి కుప్పకూలింది. లారీ వంతెన అంచున వేలాడుతోంది. ఈ సమయంలో అటువైపు వాహనాలు రాకపోవడం పెను ప్రమాదం తప్పింది. ముదినేపల్లి మండలం ముదినేపల్లి-అన్నవరం-దేవరం వైపు అన్నవరం మైనర్ డ్రైన్ పై సుమారు 50 ఏళ్ల క్రితం ఈ వంతెన నిర్మించబడింది. అప్పట్లో ఈ వంతెన పరిధిలో వ్యవసాయ సాగు జరుగుతూ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. కాలక్రమంలో ఈ ప్రాంతం వేయి ఎకరాల ఆక్వా సాగు జరుగుతుంది. దీంతో భారీ వాహనాలు , చేపల , రొయ్యల మేత లోడు లారీల రద్దీ ఎక్కువైంది. వంతెన శిథిలావస్థకు చేరుకుంది. ఈ వంతెన శిథిలమై కుప్పకూలే దశలో ఉందని తగిన చర్యలు చేపట్టాలన్న వార్తా కథనాలు వెలువడిన సంబంధిత యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. అన్నవరం-ముదినేపల్లి-దేవరం ప్రాంతాల ప్రజలు , రైతులకు రహదారి సౌకర్యం తెగిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు దారితీసింది. యుద్ధ ప్రాతిపదికన ఈ వంతెన స్థానంలో రాకపోకలకు అప్రోచ్ రోడ్డు వేసి చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత రైతులు , ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img