Friday, April 19, 2024
Friday, April 19, 2024

క్యాంపస్ ఇంటర్వ్యూలో 26 మంది ఎంపిక…

జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ తమ్మాజీరావు…

విశాలాంధ్ర -ఏలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ , హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో సర్ సి.ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల,వట్లూరు నందు ఏర్పాటు చేసిన హెచ్ సి ఎల్ టెక్ బీ ఁక్యాంపస్ డ్రైవ్ఁ కెరీర్ ప్రోగ్రాంకు 105 మంది అభ్యర్ధులు హాజరయ్యి 26 మంది మొదటి దశలో లో అర్హత పొందారని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ తమ్మాజీ రావు తెలిపారు. ఈ సందర్భంగా తమ్మాజీరావు మాట్లాడుతూ గత సంవత్సరం లో కూడా హెచ్ సి ఎల్ నుంచి ఇంటర్న్ షిప్ పూర్తి చేసుకొని ఉద్యోగాలో చేరారని ఐటి రంగం లో అవకాశాలు మెండుగ ఉన్నాయని ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్ధులకు ఇంది ఒక మంచి అవకాశం అన్నారు. ఎర్లీ కెరీర్ ప్రోగ్రాం ద్వారా ఐటి కెరియర్ మొదలుపెట్టాలనుకునే వారికీ ఇది సువర్ణ అవకాశం అన్నారు.
ఈ కార్యక్రమం లో హెచ్ సి ఎల్ మేనేజర్ అనిల్ మాట్లాడుతూ హెచ్ సి ఎల్ వంటి పెద్ద సంస్థ లలో చేరటానికి ఇది పెద్ద అవకాశం అని భారతదేశంలో 8 బ్రాంచ్ లు ఉన్నాయన్నారు. ఐటి కు భవిష్యత్లో మంచి అవకాశాలు ఉన్నాయని యువత అంది పుచ్చుకోవాలని తెలిపారు.
సీడాప్ జే.డి.ఎం పార్ధసారధి మాట్లాడుతూ ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్ధులకు ఇది ఒక మంచి అవకాశం అని మొదటి రౌండ్ పూర్తి చేసిన అభ్యర్ధులకు శుభాకాంక్షలు తెలియ జేసారు. ఈ కార్యక్రమం లో ఎపి ఎస్ ఎస్ డి సి సిబ్బంది, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img