Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జర్నలిస్టులకు రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి…

విశాలాంధ్ర- కొయ్యలగూడెం : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న పత్రిక విలేకరులకు రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని గోపాలపురం ప్రింట్ మీడియా అధ్యక్షులు ఆబోతు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం కొయ్యలగూడెం మండలం గవరవరం
గ్రామానికి చెందిన ప్రజాశక్తి విలేకరిగా పనిచేస్తున్న తప్పెట్ల శ్రీనివాస్, ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురై చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన విలేకరికిగోపాలపురం ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు, శ్రీనివాసును పరామర్శించి, పండ్లు,ఆ కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా గోపాలపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ పాత్రికేయ వృత్తిని కార్మిక చట్టం పరిధిలోకి తీసుకొచ్చి గౌరవ వేతనం ప్రకటించాలని కోరారు.రాష్ట్రంలో పాత్రికేయులకు కనీసం ఉపాధి లేకపోవడం బాధాకరమన్నారు. దీంతో విలేకరుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు పావులుగా వాడుకుంటున్నారని, ప్రభుత్వం విలేకరుల సంక్షేమానికి నిధులు కేటాయించి పాత్రికేయ కుటుంబాలకు భద్రతా భరోసా కల్పించాలన్నారు. విధి నిర్వహణలో భాగంగా వార్తల సేకరణకు వెళ్లిన పాత్రికేయులపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ లు, ఇల్లు కట్టిస్తామని, పాలకులు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. ప్రజాప్రతినిధులుమాటల్లో నిజం లేదని అన్నారు. పాలకులు ఇప్పటికైనా స్పందించి పాత్రికేయులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని రూ.10.లక్షల కల్పించడంతోపాటు, గాయాలయితే రూ.5 లక్షలు ఇవ్వాలని కోరారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. .ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపా అధ్యక్షులు, దాసరి రామారావు, కార్యదర్శి జంగా వెంకటరామిరెడ్డి, సహాయ కార్యదర్శి సిర్రా కృపారావు, కోశాధికారి తిగిరిపల్లి గాబ్రియేలు, సభ్యులు ఎం. హరికృష్ణ కొడమంచిలి మాణిక్యం, జానపాటి కిషోర్, పాముల తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img