Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను నియమించాలి…

విశాలాంధ్ర -ఏలూరు : ఏలూరు లో ఒక ఏరియా ఆసుపత్రిని వెంటనే ఏర్పాటు చేసి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రద్దు కాబడిన వైద్యులు వైద్య సిబ్బంది బెడ్స్ ను పునరుద్ధరించాలని, మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి అని సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. సోమవారం ఉదయం పవర్ పేట సిపిఎం ఆఫీసు నందు సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పళ్లెం కిషోర్ అధ్యక్షతన రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం నగర కార్యదర్శి పి కిషోర్ అధ్యక్షతన జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి పేదలు వైద్యం కోసం వస్తారని, ఆసుపత్రి సేవలు అకస్మాత్తుగా నిలిపివేయటం వలన రోగులు ఇబ్బంది పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చేయడంతో పాటు, ప్రజలకు వైద్య సౌకర్యాలకు ఆటంకం లేకుండా వెంటనే ఏలూరు ఏరియా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ , ఎమ్మారై స్కాన్ లకు రోగులను బయటకు పంపుతున్నారని, ఆసుపత్రిలోనే అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఆరోజే రిపోర్టులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగు పరచాలన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రద్దు కాబడిన నేపథ్యంలో ఏలూరులో ఏరియా ఆసుపత్రి ఏర్పాటు చేయడం కోసం స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న సేవలు పై మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పర్యటించి స్వయంగా సమస్యలు అనంతరం అధికారులు ఎమ్మెల్యేలు కలిసి తీసుకోవాల్సిన చర్యలపై వినతి పత్రాలు సభకు అధ్యక్షత వహించిన పి కిషోర్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆర్. రామ్మోహనరావు, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సిహెచ్ సురేష్, జనసేన పట్టణ అధ్యక్షులు కాశీ నరేష్ మాట్లాడుతూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న 42 స్పెషలిస్టు వైద్యులు, 150 మంది వరకు వైద్య సిబ్బంది, 350 బెడ్స్ ను రద్దు అయ్యాయన్నారు. దానివల్ల తగినంతగా వైద్య సిబ్బంది అందుబాటులో లేక ఆసుపత్రికి వస్తున్న ప్రజలకు వైద్య సేవలు అందటం లేదన్నారు. ఏలూరు ఆసుపత్రికి వస్తున్న రోగులను విజయవాడ గుంటూరు లకు పంపిస్తున్నారన్నారు. వైద్య సహాయకులుగా వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఉంటారని మొదటి సంవత్సరం కావడం వలన విద్యార్థులు కూడా పూర్తిగా అందుబాటులో లేని పరిస్థితి నెలకొందన్నారు.ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏలూరు కన్వీనర్ షేక్ మస్తాన్ వలి, సిపిఐ నాయకులు బి. ప్రసాద్, పొటేలు పెంటయ్య, సిపిఎం నగర కమిటీ సభ్యులు వి సాయిబాబు, జె గోపి, జి రుక్ము నందన రావు, కాంగ్రెస్ పార్టీ ఏలూరు నాయకులు దండు బోయిన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img