Friday, April 19, 2024
Friday, April 19, 2024

దోసపాడు దళితులకు న్యాయం చేయాలి….

కె వి పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్..

విశాలాంధ్ర- దెందులూరు : వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దోసపాడు భూ పోరాటానికి కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మద్దతు తెలిపారు. అనంతరం రెండవ రోజున చేపలు పట్టే కార్యక్రమంలో అండ్ర మాల్యాద్రి ప్రారంభిచారు. దోసపాడు పేదలు, దళితులు గత పది నెలల నుండి వారి భూముల కోసం మొక్కుకొని దీక్షతో పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని మాల్యాద్రి విమర్శించారు. పేదలందరూ భూముల్లో ఉన్న చాపలను పట్టారు భూమి మాదే పంట మాదే హక్కులు మాకే దక్కాలి అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ గత ఏడాది క్రితం ప్రారంభమైన దోసపాడు భూ పోరాటం పేదలకు, దళితులు అండగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోరాటానికి కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. రాబోయే కాలంలో జరిగే ఆందోళన పోరాటంలో కెవిపిఎస్ గా పాల్గొంటామని తెలిపారు. ఈ పోరాటంలో పేదలు, దళితులు పలుమార్లు మండల రెవెన్యూ శాఖ అధికారులు, జిల్లా అధికారులను కలిసి వారి గోడు విన్నవించుకున్న కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. పేదల హక్కులను కాలరాస్తూ, దళితుల చట్టాలను నీరుగారుస్తూ తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి మూడు నెలలు దాటిన నేటికీ ఆ కేసులో ఉన్న నిందితులను అరెస్టు చేయకపోవడం దుర్మార్గం అన్నారు. పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు భూస్వాములు ఇచ్చే లంచాలు మింగి పేదలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు అనుకూలంగా భూములు సాగు చేసుకోవచ్చని చెప్పినా రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పేదల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే, మంత్రులకు దోసపాడు దళితులు, పేదలు కనబడటం లేదా అని ఎద్దేవా చేశారు. జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు దోసపాడు దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దోసపాడు దళితులకు న్యాయం చేయాలని కోరారు. ఎవరైతే నిందితులు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఉన్నారో వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో 144,145 సెక్షన్లు ఎత్తివేసి పేదలకు రక్షణ కల్పించాలన్నారు. ఎవరైతే భూములు ఆక్రమించుకొని అనుభవిస్తున్నారో వారిపై అసైన్మెంట్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏప్రిల్ 10వ తేదీ నుండి జరగబోయే పరిణామాలకు, పోరాటాలకు, ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షరాలు వి.శివనాగరాణి, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ ఈ భూములు పేదలవే, అసైన్డ్ చేసిన భూములు కాబట్టి పేదలకు చెందుతాయని రెవెన్యూ శాఖ, పోలీసులు బోర్డులు పెట్టడంమే కాకుండా ఆ భూములలో ఉన్న పంటను పేదల స్వాధీనం చేసుకునే విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పేదల పక్షాన ఇప్పటికైనా అధికారులు ఉండాలని వారికి రక్షణ కల్పించాలని కోరారు. పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ భూములలో తవ్విన చెరువులను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులు గత సంవత్సర కాలం నుండి వారు న్యాయమైన డిమాండ్లతో పోరాడుతుంటే కనీసం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, జిల్లా కలెక్టర్ అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పి. ఆనందరావు, డి.గంగాధర్, రాజు, పవన్, బేబీ,లలిత, దుర్గ, శ్రీను,ఏసుమని, హేమలత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img