Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి….

విశాలాంధ్ర-ఏలూరు: ప్రజలు తమ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే దోమల ద్వారా వచ్చే ప్రాణాంతక వ్యాధులైన డెంగు మలేరియా చికెన్ గున్యా మొదటి వ్యాధులను కొంతవరకు తగ్గించుకోవచ్చని ఏలూరు జిల్లా ఇంచార్జి వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. నాగేశ్వరరావు సూచించారు స్థానిక ఏలూరు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టైటస్ నగర్ నిర్వహిస్తున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆ కిస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ జ్వరాలపట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్ర సందర్శించాలని, అక్కడ అన్ని పరీక్షలు ఉచితంగా చేస్తామని సూచించారు. దోమలు నిర్మూలనలో ప్రజలు భాగస్వాము వహించి నీటి నిల్వ ప్రాంతాలైన నీలతొట్టెలు, డ్రమ్ములు వారానికి ఒకసారి ఇక్కడికి మూతలు పెట్టాలని, ఫ్లవర్ వాజులు, పూల కుండీలు, రుబ్బురోలు, ఫ్రిడ్జ్ వెనుక బాక్సులలో నీరు నిలవ లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ దత్త చరణ్ , అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, రమేష్ ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img