Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మార్టేరు లాకులకు మోక్షం ఎప్పుడో..?

పనులు ప్రారంభించి నేటికీ 14 సంవత్సరాలు…

విశాలాంధ్ర – పెనుమంట్ర: మార్టేరు (నెగ్గి పూడి) లాకులను బ్రిటిష్ హయాంలో నిర్మించారు. ఈ పురాతన కట్టడం పగుళ్లు ఏర్పడి, శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు 2009వ సంవత్సరంలో ఆర్థిక సంఘం నిధులు రూ.128 కోట్లతో మార్టేరు నుండి మొగల్తూరు వరకు కాలువపై నిర్మాణ పనులు చేపట్టారు. కాంట్రాక్టర్ ఒక స్థాయి వరకు నిర్మించి, దాన్ని మధ్యస్థంగా నిలిపివేశారు. 14 సంవత్సరాల నుండి నేటి వరకు మరల పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఈ లాక్ పై మార్టేరు నుండి మొగల్తూరు వరకు 52 ,492 ఎకరాలకు, మార్టేరునుండి పెరవలి వరకు 38,508 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అయితే కాంట్రాక్టర్ కి ఇస్తాము అన్న పనులు పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ వెనక్కి తగ్గారని ప్రాథమిక సమాచారం. ఈ నేపథ్యంలో నేటి వరకు పనులకు సంబంధించి క్లియరెన్స్ రాకపోవడంతో కొత్త టెండర్లు పిలిచి వేరే వారికి ఇచ్చే అవకాశం లేదని, ఈ సంవత్సరం కూడా పనులు ప్రారంభానికి నోచుకునే అవకాశం లేదని సంబంధిత శాఖ వారు తెలియజేశారు. ఇకనైనా ఉన్నతాధికారులు, నాయకులు పట్టించుకుని వీటిని అభివృద్ధి పరచాలని స్థానిక రైతాంగం కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img