Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రైతులు శాస్త్రీయ పద్ధతులలో పంటలు పండిస్తే అధిక దిగుబడులు….

విశాలాంధ్ర-జీెలుగుమిల్లి: పొగాకుతో పాటు ఇతర పంటలను రైతులు శాస్త్రీయ పద్ధతులలో పండిరచినట్లయితే అధిక దిగుబడులను సాధించవచ్చునని సి టి ఆర్‌ ఐ రాజమండ్రి డైరెక్టర్‌ మాగంటి శేషు మాధవ్‌ సూచించారు. గురువారం జీలుగుమిల్లి సి టి ఆర్‌ ఐ లో సమగ్ర శాస్త్రీయ విధానంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి, పశువులు దాన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్న, చిన్న కారు రైతులు పశువులు పెంపకం వల్ల కలిగే లాభాలను వివరించారు. మందుల పిచికారిలో నూతన పద్ధతులు తెలుసుకోవాలని రైతులకు సూచించారు. మేలు రకం పొగాకు వంగడాలు అయిన ఎఫ్‌ సి జే 11 దీనిని రైతులు పండిరచాలన్నారు. ఈ పశువుల దానాలు సుమారు 400 మంది ఎస్‌ సి రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు. పొగాకు పసుపు పూల బంతి తోటలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెడ్‌ సుబ్బయ్య, శాస్త్రవేత్త కే సరళ, మేనేజర్‌ ఎంవిజయకృష్ణ ,అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎస్‌ సింహాచలం, సిబ్బంది టి రమేష్‌, బిందు, ఏ ప్రభు వెంకటేశ్వరరావు, టి శ్రీను, దుర్గారావు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img