Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వైసిపి ప్రభుత్వం అరాచక పరిపాలనకు వ్యతిరేకంగా నిరసన

విశాలాంధ్ర – కొయ్యలగూడెం : దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వైసిపి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని టిడిపి కొయ్యలగూడెం మండల ఎస్ సి సెల్ అధ్యక్షులు ఉప్పాటి వెంకట్రావు పేర్కొన్నారు. కొయ్యలగూడెం లో పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద టిడిపి నాయకులు శనివారం నల్ల రిబ్బన్లను ధరించి వైసిపి ప్రభుత్వం అరాచక పరిపాలనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. తొలుత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప్పాటి వెంకటరావు మాట్లాడుతూ టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి లో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి హాజరవుతుంటే, పోలీస్ శాఖ ముందు అనుమతి ఇచ్చి, వైసిపి ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని పోలీస్ శాఖ వెనకకు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం, చివరి నిమిషంలో పోలీస్ శాఖ వారు ఇచ్చిన అనుమతిని నిలుపుదల చేయడం చూస్తుంటే అప్రజాస్వామిక చర్య అన్నారు.ఆంధ్ర రాష్ట్రంలో అరాచక పరిపాలన కొనసాగుతుందన్నారు. పట్టణ ప్రధాన కార్యదర్శి పూలపల్లి వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని అన్నారు. మాజీ మంత్రి అని చూడకుండా కొత్తపల్లి జోహార్ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం చూస్తుంటే దళితుల ఆత్మగౌరవంపై దెబ్బతీస్తున్నట్లు ఉందని తెలిపారు. దళితులపై జరుగుతున్న దాడులు నిలుపుదల చేయాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి, పట్టణ అధ్యక్షులు జేష్ట రామకృష్ణ, పోలవరం నియోజకవర్గం ఎస్ సి సెల్ అధ్యక్షులు చాపల చిన్నబాబు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షేక్ భాషా, బెల్లాన శ్రీను, రాచూరి మదన్, కర్రీ అన్నవరం, కొడెల్లి వెంకటేష్, శేషారావు, మలిశెట్టి కేసుబాబు, టైలర్ రమణ, కాగితాల గోపి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img