Friday, April 19, 2024
Friday, April 19, 2024

వైసీపీ ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం….

టీడీపీ రాష్ట్ర ఎస్‌ సి సెల్‌ ప్రధాన కార్యదర్శి ఆకుమర్తి రామారావు
విశాలాంధ్ర,జంగారెడ్డిగూడెం: వైసీపీ ప్రభుత్వంలో ఎస్‌ సి లకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ రాష్ట్ర ఎస్‌ సి సెల్‌ ప్రధాన కార్యదర్శి ఆకుమర్తి రామారావు ప్రభుత్వాన్ని విమర్శించారు.మండలంలోని అక్కంపేట గ్రామంలోని దళిత పేటలో ఆకుమర్తి రామారావు వినూత్నంగా జై భీమ్‌ జై తెలుగుదేశం అనే కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. ఈ సందర్భంగా దళితవాడల్లో పర్యటిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ వైసీపీ ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ, టీడీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు చేసిన అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, చైతన్యపరుస్తూ ప్రతీ ఇంటిని సందర్శించారు . ఈ సందర్భంగా వృద్ధులకు, మహిళకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆకుమర్తి రామారావు మాట్లాడుతూ శనివారం ప్రారంభమైన ఈ కార్యక్రమం చింతలపూడి నియోజకవర్గం లోని అన్ని మండలాల్లోని దళిత వాడల్లో కొనసాగుతుందన్నారు.ప్రతీ దళిత కుటుంబాన్ని కలిసి వారి సమస్యలను తెలుసుకుని టీడీపీ జాతీయ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ అధికారం చేపట్టిన నాటి నుండి దళితులకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేసి ఎస్‌ సి లను మోసం చేసిన విషయాన్ని ప్రతీ ఎస్‌ సి కుటుంబం దృష్టికి తీసుకెళ్తానన్నారు.టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ దాసరి శ్యామ్‌ చంద్ర శేషు మాట్లాడుతూ మానవ హక్కుల దినోత్సవం నాడు ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం శుభ పరిణామని,వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గానికి మంచి జరగలేదని అందరికీ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
విదేశీ విద్య, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌, పెళ్లి కానుకలు, భీమా, సబ్సిడి రుణాలు ఇలా అన్ని పథకాలను నిర్వీర్యం చేసారన్నారు.ఈ కార్యక్రమానికి మండల ఎస్‌ సి సెల్‌ అధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాస్‌ అధ్యక్షత వహించగా, మండల పట్టణ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, రావూరి కృష్ణ, రాష్ట్ర నాయకులు చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, పగడం సౌభాగ్యవతి, తారిపిరెడ్డి రామకృష్ణ, గంటా రామారావు, రాగాని రామకృష్ణ, రాగాని శ్రీను, యడ్లపల్లి ఏడుకొండలు, పులపాకుల సూర్యచంద్రం ,అల్లూరి రామకృష్ణ, వింజమూరి ప్రభాకర్‌, భార్గవ్‌, పింగుల నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img