Friday, April 19, 2024
Friday, April 19, 2024

సామాజిక న్యాయం ఎక్కడ….?

విశాలాంధ్ర -చాట్రాయి : నూజివీడు నియోజకవర్గం లోని లక్షలాది మంది ఓటర్లలో దళితులు బలహీన వర్గాలలో ఎమ్మెల్యే సీటుకు పోటీ చేయడానికి నేటికీ ప్రధాన పార్టీలకు అభ్యర్థులే లేరా……? సామాజిక న్యాయం ఎక్కడ….? అంటూ సామాజిక చైతన్య వేదిక నాయకులు సామాజిక కార్యకర్త యివి శ్రీనివాసరావు ప్రశ్నించారు. బుధవారం జగ్జీవన్ రామ్ 1 16వ జయంతి సందర్భంగా చాట్రాయి మండలం చిన్నంపేటఅంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కెవిపిఎస్ మండల అధ్యక్షులు కొమ్ము ఆనందం అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నూజివీడు నియోజకవర్గంలో స్థానికంగా పుట్టి పెరిగిన జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న బలహీన వర్గాలు ,దళితులలో 80కిపైగా గ్రామాలలో 2లక్షల 30వేల ఓటర్ల లో ప్రదాన రాజకీయ పార్టీ లలో ఎంఎల్ ఎ అభ్యర్థులుగా పోటీచేయడానకి అర్హత కలిగిన ఇద్దరు వ్యక్తులు కూడా లేకుండా పోయారంటే పాలకవర్గ పార్టీల నేతల మాటలు కోటలు దాటుతున్న చేతలు గడప దాటడం లేదనడానికి ఇదే నిదర్శనం అన్నారు. మహనీయుడు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం వలనే తప్పనిసరి పరిస్థితులలో రిజర్వేషన్ ప్రకారం చిన్నా చితకా పదవులు ఇస్తున్నారన్నారు. చాట్రాయి ఎంపీపీ దళిత మహిళ కావడం వలన మండల పరిషత్ కార్యలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవమే నిర్వహించలేదన్నారు.ఎంపిపి ని కనీసం గౌరవించలేదన్నారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలలో సభ్యులు కాని వారు వచ్చి కూర్చుని సమీక్ష చేస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు.ఎంపీటీసిలు అత్యధికులు దళితులు, బలహీన వర్గాలు ఉండటం వలన వారికి కనీసం ఎజెండా ఇస్తున్న దాఖలాలు కూడా లేవు అన్నట్లు తెలుస్తోందన్నారు.మండల పరిషత్తు లో ఏం జరుగుతుందో తెలుసు కోవడానికి సమాచార హక్కు చట్టంలో అడిగిన అధికారులు కాలయాపన చేస్తున్నారు తప్ప ఇవ్వడంలేదన్నారు. మండల పరిషత్తు మొత్తం ఒకే పార్టీ అయినప్పటికీ అక్కడ సామాజిక న్యాయం అలా వుందన్నారు. అందరికీ అందుబాటులో ఉండాలని కొత్తగా ఆసుపత్రి మంజూరు అయితే దానిని ఎన్టీఆర్ జిల్లా సరిహద్దులలో నిర్మిస్తున్నారని, దూర ప్రాంతాల నుండి వెళ్లే దళితులు బలహీన వర్గాల గర్బిణీస్త్రీ లు బాలింతలు పరిస్థితి ఎమిటో ఒక్క సారి ఆలోచించాలన్నారు. పాలనా సౌలభ్యం అందరికీ దగ్గరగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి సచివాలయాలు ఏర్పాటు చేస్తే అనేక చోట్ల ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడిచే విదంగా నిర్మించారన్నారు. టిడిపి బీసీలకు సామాజిక న్యాయం చేసింది తామే అని పదే పదే చెప్పుకుంటున్నా నియోజకవర్గంలో పుట్టి పెరిగిన స్తానికులు 40 వయస్సు వున్న పార్టీ కి ఒక్కరంటే ఒక్క రు కూడా ఎంఎల్ ఎ అభ్యర్థి గా పోటీ చేయడానికి తగిన వారే లేకపోవడం చూస్తే చంద్రబాబు నాయకత్వం స్తానికులకు ఇచ్చే ప్రాదాన్యతకు అద్దంపడుతుందన్నారు. చంద్రబాబు అభిప్రాయాలను నూజివీడు నియోజకవర్గ ప్రజలపై బలంగా రుద్దినట్లువుందన్నారు. ఆయన నిర్ణయాలు స్తానిక ప్రజలను సామాజిక తరగతులవారిని చిన్న బుచ్చి నట్లు వుందన్నారు.సభాధ్యక్షులు కెవిపిఎస్ మండల కార్యదర్శి కొమ్ము ఆనందం మాట్లాడుతూ దళితులు బలహీన వర్గాల వారు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష కార్యచరణకు దిగాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.వాడ వాడలా వున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని నిలదీద్దాం అన్నారు. మండలంలో 750 మంది గత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకున్న నిరుపేదలకు బిల్లులు నేటికి రాలేదని వాటి కోసం ఉద్యమిద్దమన్నారు.
పుట్టినరోజు వేడుక
జగ్జీవన్ రామ్ పుట్టినరోజు నాడే పుట్టిన కొమ్ము జోనాదన్ కు సభలో నే పుట్టినరోజు వేడుక నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img