Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సి.బి.యస్.ఇ 10 వ తరగతి ఫలితాలలో “విజ్ఞాన్” ప్రభంజనం…..

విశాలాంధ్ర -ఏలూరు: సి.బి.యస్.ఇ సిలబస్ 10 వ తరగతి ఫలితాలలో భోగాపురం విజ్ఞాన్
వరల్డ్ వన్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించి అత్యుత్తమ ఫలితాలతో ఏలూరు,
జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచారని స్కూల్ ప్రిస్సిపాల్ బి.ఎన్.ఎస్.మణి తెలిపారు.
లేఖశ్రీ సిరసాల 97 శాతం మార్కులతో టాపర్ గా నిలిచిందని కేశవ శ్రీహర్ష 96శాతం సమీహ
మహమ్మద్ 96శాతం సాధించి ద్వితీయ, త్రిశాంకు 95.6శాతం తో తృతీయ స్థానంలో
నిలిచారని తెలిపారు . కె .రుషిత 95శాతం,పి. బ్రాహ్మిణి 95శాతం,ఎల్. అభినవ్ 94.2శాతం,జి.
వేదవర్షిత్ 94శాతం,పి లిఖిత94శాతం లతో ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు.6గురు 95శాతం,
20 మంది 90 శాతం,48 మంది 80 శాతం పైన మార్కులు సాధించిన్నారన్నారు.100 శాతం ఉత్తీర్ణత
సాధించారన్నారు. గణితంలో లేఖశ్రీ 100కు100 సాధించి రికార్డు నెలకొల్పిందని తెలిపారు. తెలుగులో 100 కు99 ఎనిమిది మందికి, గణితంలో 100 99నలుగురికి, ఆంగ్లంలో100 కి 98ఒకరు, సైన్స్ లో100కి98 ఒకరు,సోషల్ 100కి ఇద్దరు, హిందీలో100కి ఒకరు సబ్జెక్ వారీగా ఉత్తమ మార్కులు సాధించారని తెలిపారు.అనుభవము అంకిత భావము గల ఉపాధ్యాయులు, సమగ్ర విజ్ఞాన్ విద్యా ప్రణాళిక
తల్లిదండ్రులు ప్రోత్సాహము ఈ ఫలితాలకు ముఖ్య కారణమని మణి తెలిపారు.తమ
స్కూల్ ఐఐటి సిలిబస్తో పాటు కేంబ్రిడ్జ్ ఇంగ్లీషు కోర్సును కూడా ప్రవేశపెట్టి ఉత్తమ ఫలితాలు
సాధిస్తూన్నామని తెలిపారు. ఈ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధినీ, విద్యార్ధులను,
ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను విజ్ఞాన్ సంస్థ చైర్మన్ డా. లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు కృష్ణదేవరాయులు, ప్రిన్సిపాల్ మణి, మేనేజరు అప్పారావు
సిబ్బింది అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img