Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సేవ చేయడం గొప్ప వరం..

అంతర్జాతీయ లయిన్స్‌ క్లబ్‌ పాస్ట్‌ ప్రెసిడెంట్‌ డగ్లస్‌ ఎక్స్‌ అలగ్జాండర్‌ …

విశాలాంధ్ర` ఉండి: సేవ చేయడం గొప్ప వరమని సేవ చేయటంలో ఉన్న సంతృప్తి మరి దేనిలో ఉండదని లయిన్స్‌ క్లబ్‌ అంతర్జాతీయ పాస్ట్‌ ప్రెసిడెంట్‌ డగ్లస్‌ ఎక్స్‌ అలగ్జాండర్‌ అన్నారు. బుధవారం ఆకివీడు వచ్చిన సందర్భంగా ఉండి లయిన్స్‌ క్లబ్‌ సభ్యులు డగ్లస్‌ ఎక్స్‌ అలెగ్జాండర్‌ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో పలు ప్రాంతాలు సందర్శించినట్టు తెలిపారు. అన్ని లయిన్స్‌ క్లబ్‌ సేవలు బాగున్నాయిని అన్నారు. తాను 1984నుంచి లయిన్స్‌ క్లబ్‌ లో వివిధ హోదాలో పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ ఎల్‌ సి ఐ ఫ్‌ ఛైర్మెన్‌ గా ఉన్నానన్నారు. ఆయన కలిసిన వారిలో ఉండి లయిన్స్‌ క్లబ్‌ అడ్మిస్ట్రేటర్‌ రుద్ర రాజు నరసరాజు, అధ్యక్షులు గొట్టుముక్కల రాము, వైస్‌ ప్రెసిడెంట్‌ గాదిరాజు రంగరాజు, కోశాధికారి కన్నెగంటి రూత్‌ కళ, మాజీ అధ్యక్షులు భూపతిరాజు హరనాధ్‌ రాజు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img