Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మూడు తరాల కమ్యూనిస్టు చరిత్ర కలిగిన కుటుంబం

జంగారెడ్డిగూడెం: కృష్ణ చైతన్య ది కమ్యూనిస్టు కుటుంబం. కమ్యూనిస్టు పార్టీ నాయకులు మన్నవ సాంబశివరావు, లక్ష్మీ సౌభాగ్యం దంపతులకు జన్మించారు.సాంభశివరావు తండ్రి మన్నవ సుబ్బారావు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా పనిచేశారు. ఆయన తల్లి లక్ష్మీ సౌభాగ్యం పార్టీ అనుభంధ మహీళా సంఘం జిల్లా నాయకురాలిగా పనిచేసారు. ఈ నేపథ్యంలో కృష్ణ చైతన్య చిన్నతనంలోనే కమ్యూనిస్టు భావాజాలాన్ని పుణికిపుచ్చుకుని, విద్యార్థి సంఘ నాయకుడిగాను, యువజన సంఘం, జనసేవాదళ్ సభ్యుడిగా శిక్షణ పొంది సీపీఐ నియమావళికి అనుగుణంగా సుశిక్షితుడైన కార్యకర్తగా, తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి జంగారెడ్డిగూడెం పట్టణ కార్యదర్శిగా , రెండు దఫాలుగా జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి గా పనిచేసారు. ఈ సమయంలో జంగారెడ్డిగూడెం మండలంలో నెలకొన్న అపరిష్కృత సమస్యల పరిష్కారం కొరకు అనేక ఉద్యమాలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణ,మండల కార్యదర్శి గా పనిచేసినప్పుడు ఎన్నో ప్రజా ఉద్యమాలలో పాల్గొని పేద ప్రజల పక్షాన నిలబడి ఇళ్ళు,ఇళ్ల స్థలాలు, రావడానికి విశేష కృషి చేశారు.ఉద్యమ చరిత్ర కలిగిన కృష్ణ చైతన్య అతి చిన్న వయస్సు లోనే జిల్లా కార్యదర్శి గా ఎన్నిక కావడం విశేషం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img